Jagadeesan: వరుసగా ఐదో సెంచరీ.. దేశవాళీలో జగదీశన్ రికార్డుల మోత.. కోహ్లీ, రోహిత్‌ల రికార్డులు మాయం

Jagadeesan: తమిళ తంబి నారాయణ్ జగదీశన్ దేశవాళీలో అత్యుత్తమ ఫామ్ చాటుతున్నాడు. దేశవాళీలో భాగంగా విజయ్ హజారే ట్రోఫీ (వీహెచ్టీ) లో సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఇప్పటికే వరుసగా నాలుగు సెంచరీలు చేసి టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ రికార్డులు బ్రేక్ చేసిన జగదీశన్.. తాజాగా ఐదో సెంచరీ కూడా సాధించాడు. ఈసారి ఏకంగా డబుల్ సెంచరీతో దుమ్ముదులిపాడు. అరుణాచల్ ప్రదేశ్ తో మ్యాచ్ లో 141 బంతుల్లో 25 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో ఏకంగా 277 పరుగులు చేశాడు. తద్వారా అతడు పలు పాత రికార్డులను తుడిపేయడమే గాక కొత్త రికార్డులను తన పేరిట రాసుకున్నాడు.

రికార్డులపై ఓ లుక్కేస్తే..

విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా నాలుగు ఇన్నింగ్స్ లలో సెంచరీలు బాదినవారిలో గతంలో విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్ లు ముందున్నారు. ఇటీవలే జగదీశన్ వీరి రికార్డును సమం చేశాడు. తాజాగా ఐదో సెంచరీ చేసి కోహ్లీని అధిగమించాడు.
– దేశవాళీ (లిస్ట్-ఏ) క్రికెట్ లో వరుసగా ఐదు ఇన్నింగ్స్ లలో సెంచరీలు చేసిన క్రికెటర్లలో భారత్ నుంచి జగదీశన్ ఒకే ఒక్కడు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే కుమార సంగక్కర (2014-15), అల్విరో పీటర్సన్ (2015-16) లు నాలుగు సెంచరీలతో ఉన్నారు.
– ఈ సిరీస్ లో వరుసగా ఐదో సెంచరీ చేసిన జగదీశన్.. ఇప్పటివరకు 799 పరుగులు చేశాడు. వీహెచ్టీలో ఇది రెండో అత్యధిక స్కోరు. 2020-21లో పృథ్వీ షా.. 827 పరుగులు సాధించాడు.
– దేశవాళీ (50 ఓవర్ల క్రికెట్ లో) లో వన్డే ఫార్మాట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (277). గతంలో ఈ రికార్డు భారత జట్టు నుంచి రోహిత్ శర్మ (268) పేరిట ఉండేది. ఇంగ్లీష్ క్రికెటర్ అలెస్టర్ బ్రౌన్.. (160 బంతుల్ల 268) రికార్డు కూడా బద్దలైంది.
– అరుణాచల్ ప్రదేశ్ తో మ్యాచ్ లో జగదీశన్ తో పాటు మరో ఓపెనర్ సాయి సుదర్శన్ లు కలిసి తొలి వికెట్ కు ఏకంగా 416 పరుగులు జోడించారు. ఇది కూడా ప్రపంచ రికార్డే. గతంలో క్రిస్ గేల్ – మార్లున్ సామ్యూల్స్ 2015లో జింబాబ్వే మీద 372 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ రికార్డు ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయింది.
– లిస్ట్ ఏ క్రికెట్ లో 500 స్కోరు చేసిన ఏకైక జట్టు తమిళనాడు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -