RaviTeja: రవితేజకు ఊహించని ఆఫర్ ఇచ్చిన జగన్.. ఏం చేశారంటే?

RaviTeja: టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజకు ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. అయితే ఇది ఎవరు ఊహించినటువంటి ఆఫర్ అని చెప్పాలి. అసలు రవితేజకు జగన్ ఆఫర్ ఇవ్వడం ఏంటి రవితేజ కూడా రాజకీయాలలోకి రావడం లేదు కదా కొంపతీసి ఈయన కనుక రాజకీయాలలోకి వస్తున్నారా ఏంటి అని సందేహాలు ప్రతి ఒక్కరికి కలుగుతాయి. ఇంతకీ జగన్ రవితేజకు ఇచ్చిన ఆఫర్ ఏంటి అనే విషయానికి వస్తే..

రవితేజ హీరోగా నటిస్తున్నటువంటి రావణాసుర సినిమా ఏప్రిల్ ఏడవ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. అయితే రావణాసుర సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాకు అడిషనల్ షోలకు పర్మిషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇది అన్ని థియేటర్లలోను కాదని కేవలం ఎంపిక చేసిన థియేటర్లలో మాత్రమే అదనపు షోలు ప్రదర్శించడానికి మాత్రమే అనుమతిని ఇచ్చారు.

 

ప్రస్తుతం రోజుకు నాలుగు ఆటలు ప్రదర్శితం k అవుతుండగా ఎంపిక చేసిన థియేటర్లలో ఎర్లీ మార్నింగ్ షో కూడా ప్రసారం చేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది.ఇక ఇదే విషయం గురించి రవితేజ స్పందిస్తూ ఏపీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలా రవితేజ సినిమాకు మరొక అదనపు షో ప్రదర్శించడానికి అనుమతి తెలపడంతో రవితేజ అభిమానుల సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

తాజాగా రవితేజ ధమాకా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఈ క్రమంలోనే రావణాసుర సినిమాపై కూడా భారీ అంచనాలే ఏర్పడ్డాయి.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి పోస్టర్లు టీజర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచాయి. ఇక ఈ సినిమాకు సుధీర్ వర్మ డైరెక్టర్ గా వ్యవహరించిన విషయం మనకు తెలిసిందే. మరి ఈ సినిమాతో ఈ మాస్ హీరో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.

 

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -