Varahi Yatra: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు చోటు చేసుకున్న సంగతి మనకు తెలుసు. మొన్నటి వరకు ఒకలా ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు చంద్రబాబునాయుడు అరెస్టుతో ఒక్కసారిగా మారిపోయాయి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తరువాత జనసేన పార్టీ టిడిపి పార్టీతో పొత్తు కుదుర్చుకొని వచ్చే ఎన్నికల బరిలోకి రాబోతుందని స్పష్టంగా వెల్లడించారు.
చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు గానీ లేదా జనసేన పార్టీకి చెందిన నాయకులు కానీ ఇప్పటివరకు ఒక బహిరంగ సభ అనేది కూడా ఏర్పాటు చేయలేదు.. మొదటిసారి పవన్ కళ్యాణ్ అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి వారాహి యాత్ర ప్రారంభం కాబోతుందని వెల్లడించారు ఈ క్రమంలోని ఈయన నేడు మంగళగిరికి చేరుకొని ఒకటవ తేదీ వారాహి యాత్ర ప్రారంభించబోతున్నట్లు తెలియజేయడంతో ఈ వారాహి యాత్రలో పవన్ ప్రసంగం గురించి ప్రతి ఒక్కరు చాలా ఆత్రుత కనబరుస్తున్నారు.
ఇదివరకు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేసినప్పటికీ జనసేన పార్టీకి అనుకూలంగా మాత్రమే ఆయన ప్రసంగాలు చేశారు జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయగలదు ఏం చేస్తుంది అనే విషయాలను వెల్లడించారు అయితే ఇప్పుడు పొత్తు కుదరడంతో ఈయన టిడిపి పార్టీని జనసేన పార్టీని ఉద్దేశించి ఏ విధమైనటువంటి ప్రసంగం చేయబోతున్నారు అన్న విషయాలపై ఆత్రుత నెలకొంది.
అయితే వారాహి యాత్ర ద్వారా ప్రజలలోకి పవన్ కళ్యాణ్ రావడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి తరుణంలో బ్లూ మీడియా కూడా పెద్ద ఎత్తున ఈ సభలో అలజడి చెలరేగెలా చేస్తే ఎక్కువమందికి చేరే అవకాశాలు ఉంటాయన్న ఉద్దేశంతో రెండు పార్టీల నడుమ చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందే ఉద్దేశంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఉందని తెలుస్తుంది. ఇలాంటి కుట్రల నడుమ వారాహి యాత్ర సక్సెస్ అయ్యేనా అనే సందేహం కూడా అందరిలోనూ కలుగుతుంది.