YS Jagan: పార్టీ నేతల నమ్మకాన్ని కోల్పోతున్న జగన్.. అవే తప్పులంటూ?

YS Jagan: వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంక్షేమ ఫలాలను అందిస్తున్నప్పటికీ ఆయనకు రాష్ట్రంలో ఎదురుగాలి వీస్తుందని తెలుస్తుంది. తాజాగా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోటాలో భాగంగా జరిగిన ఎన్నికలలో నలుగురు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు.అయితే ఆ నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ సస్పెండ్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ నలుగురిలో ఒకరు దళిత మహిళ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కాగా మిగిలిన ముగ్గురు జగన్ సామాజిక వర్గానికి చెందిన రెడ్డి ఎమ్మెల్యేలు కావడం విశేషం.

ఈ విధంగా జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఇలా క్రాస్ ఓటింగ్ కి పాల్పడటంతో సొంత సామాజిక వర్గ నేతలు కూడా జగన్ ను నమ్మడం లేదా అందుకే ఇలా క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.అసలు గత ఎన్నికలలో నెల్లూరు జిల్లా వైపీపీకి పదికి పది అసెంబ్లీ స్థానాలనూ కట్టబెట్టింది. ఇప్పుడు ఆ జిల్లాకే చెందిన ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఆనం ఆదినారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ముగ్గురిని పార్టీ సస్పెండ్ చేసింది.

 

ఇక ఈ ముగ్గురిలో ఆనం ఆదినారాయణ రెడ్డి కోటం శ్రీధర్ రెడ్డి గత కొద్దిరోజులుగా జగన్ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పై కూడా విమర్శలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు అయితే ఈయన కూడా క్రాస్ ఓటింగ్ చేశారని ఆరోపిస్తూ ఎలాంటి ఆధారాలు లేకుండా తనని సస్పెండ్ చేశారంటూ ఈయన ఆరోపణలు చేశారు. అలాగే తాను క్రాస్ ఓటింగ్ వేశానని సజ్జల రామకృష్ణ గారికి ఎలా తెలుసు అంటూ ఈయన ప్రశ్నించారు.

 

ఏది ఏమైనా జగన్ కు సొంత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేల నుంచి ఈ విధమైనటువంటి తిరుగుబాటు రావడంతో వచ్చే ఎన్నికలలో జగన్ కి మరింత కష్టం కానుందని పలువురు భావిస్తున్నారు.అయితే ఈ తిరుగుబాటు కేవలం నెల్లూరు జిల్లాలో మాత్రమే కాదని పలు జిల్లాలలో కూడా సొంత సామాజిక వర్గానికి చెందినవారు జగన్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇలా సొంత సామాజిక వర్గానికి చెందిన నేతల నుంచి వ్యతిరేకత రావడానికి గల కారణం జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఒకే సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నారంటూ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధాని అంటూ ప్రతిపక్ష నేతగా మద్దతు తెలిపిన జగన్ సీఎం అయిన తర్వాత మూడు రాజధానులను ప్రకటించి మాట తప్పారు. ఇలా జగన్ చేస్తున్నటువంటి ఈ తప్పులే ఆయనకు శాపంగా మారబోతున్నాయని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Nandyal: మా జీవితాలను మీరే నాశనం చేశారు.. వైసీపీ ఎమ్మెల్యే భార్యకు భారీ షాక్ తగిలిందా?

Nandyal: ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో నామినేషన్ ప్రక్రియలు కూడా చాలా వేగవంతంగా జరిగాయి. ఇక నేటితో నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి. ఇక నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ కూడా...
- Advertisement -
- Advertisement -