Jagan-NTR: ఎన్టీఆర్ విషయంలో ఎవరూ ఊహించని ప్లాన్ వేసిన జగన్

Jagan-NTR: సీఎం వైఎస్ జగన్ ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి తెరలేపబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా ఎవరూ ఊహించని నిర్ణయ తీసుకుని ఏపీలో అనూహ్య పరిణామానికి దారి తీయబోతున్నానే చరచ్ జరుగుతోంది. ఈ నిర్ణయంతో ప్రతిపక్ష టీడీపీకి భారీ దెబ్బ కొట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. జగన్ తీసుకోబోయే సంచలన నిర్ణయం వైసీపీ శ్రేణులను కూడా షాక్ కు గురి చేసేలా ఉండబోతుందట. ఇంతకు ఆ నిర్ణయం ఏంటి అనే విషయాలు తెలుసుకుంటే..

ప్రస్తుతం ఏపీలో ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారం రాజకీయం ప్రకంపనలు రేపుతోంది. రాత్రికి రాత్రి ఆన్ లైన్ లో మంత్రులతో ఆమోదం చేయించి పొద్దున్నే అసెంబ్లీలో ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు. కనీసం అధికారుల నిర్ణయం తీసుకోకుండా, వైసీపీ నేతలకు కూడా తెలియకుండా జగన్ ఈ నిర్ణయం తీసుకన్నారు. దీంతో జగన్ నిర్ణయంతో వైసీపీ నేతలు కూడా నోరెళ్లబెట్టారు. జగన్ నిర్ణయం సరైనది కాదని వైసీపీతోనే ఉన్న వల్లభనేని వంశీ, యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ లాంటి నేతలు వ్యతిరేకించారు. అధికార బాషా సఘం పదవికి యార్లగడ్డ వెంటనే రాజీనామా చేశారు.

ఇక వల్లభనేని వంశీ కూడా వెంటనే జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. వెంటనే రాజీనామాను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక కొడాలి నాని ఇప్పటివరకకు స్పందించకపోగా.. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మిపార్వతి చాలా ఆలస్యంగా స్పందించారు. జగన్ నిర్ణయాన్ని ఆమె సమర్థించారు. వైఎస్సార్ డాక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారని, ఆయన పేరు పెడితే తప్పేంటని ఆమె ప్రశ్నించారు. దీంతో లక్ష్మిపార్వతిపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే జగన్ నిర్ణయంతో ఏపీలో వైసీపీపై వ్యతిరేకత మరింత పెరిగింది. రాజకీయాలు, కులాలు, మతాలకు అతీతంగా ఎన్టీఆర్ ను అందరూ అభిమానిస్తారు. హీరోగా, రాజకీయ నాయకుడిగా తెలుగు వారందరూ ఎన్టీఆర్ ను దేవుడిగా కొలుస్తారు. అలాంటి ఎన్టీఆర్ పేరును ఆయన పెట్టిన యూనివర్సిటీకి తొలగించడం అంటే సాహసమే అని చెప్పవచ్చు. దీంతో జగన్ తీసుకున్న నిర్ణయంపై భారీగా వ్యతిరేకత వస్తుంది. సొంత పార్టీ నేతలే జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీకి కూడా నష్టం జరిగే అవకాశముందని చెప్పవచ్చు.

ఈ క్రమంలో జగన్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనే ప్రతిపాదనలు చేసే అవకాశముంది. త్వరలో కేబినెట్ లో ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలపనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేయనున్నారు. అసెంబ్లీలో ఆమోదించిన తర్వత కేంద్రానికి పంపున్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న వచ్చేలా ప్రధాని మోదీని కలిసి ప్రయత్నం చేయనున్నారు. దీని వల్ల ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పుపై వచ్చిన వ్యతిరేకత తగ్గుతుందని, ఎన్టీఆర్ అభిమానులందరికీ ఆకట్టుకోవచ్చని జగన్ భావిస్తున్నారట. దీని వల్ల టీడీపీని దెబ్బ కొట్టనట్లు అవుతుందని జగన్ ఆలోచనలు చేస్తున్నారట.

ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి పాజిటివ్ వస్తుందని, వచ్చే ఎన్నికల్లో లాభపడవచ్చని జగన్ ప్లాన్ చేస్తున్నారట. చంద్రబాబు కూడా చేయని పనిని తాము చేశామని వైసీపీ చెప్పుకునే అవకాశం ఉంటుంది. దీని వల్ల కమ్మ సామాజికవర్గం కూడా జగన్ వైపు మళ్లే అవకాశముంది. ఇప్పటికే కృష్ఝా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి జగన్ పేరు తెచ్చకున్నారు. చంద్రబాబు అన్ని ఏళ్లు సీఎంగా ఉండి చేయని పనిని కూడా తాను చేశానని వైసీపీ చెప్పుకుంటోంది. ఇప్పుడు ఎన్టీఆర్ కు భారతరత్న వచ్చేలా చేయడం ద్వారా చంద్రబాబు, టీడీపీని కోలుకులేని దెబ్బకొట్టవచ్చని భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -