Jagan: కమెడియన్లకు వరుస ప్రభుత్వ పదవులు.. సీఎం జగన్ ప్లాన్ ఏంటి?

Jagan: వచ్చే ఎన్నికలకు సీఎం వైఎస్ జగన్ ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలించేందుకు ఇప్పటినుంచే వ్యూహలు పన్నుతున్నారు. టీడీపీ, జనసేన కలిసేందుకు సిద్దమవుతున్న క్రమంలో జగన్ రాజకీయంగా మరింత దూకుడు పెంచారు. వైసీసీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. నేతలను మరింత యాక్టివ్ చేసి ప్రత్యర్థులపై విమర్శలు దాడిని కొనసాగించేలా చేస్తోన్నారు. రాజకీయ కార్యక్రమాలను మరింత షురూ చేసే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతారోననే ప్రచారం కూడా జరుగుతోంది.

 

వైసీపీకి సినీ గ్లామర్ తెచ్చుకోవడంపై జగన్ మళ్లీ ప్రయత్నాలు చేస్తోన్నారు. టీడీపీకి తొలి నుంచి సినీ గ్లామర్ బాగానే ఉంది. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ కావడంతో చాలామంది టాలీవుడ్ డైరెక్టర్లు, నటులు టీడీపీకి మద్దతుగా ఉన్నారు. ఇక వైసీపీకి చూసుకుంటే ఒక్క రోజా మాత్రమే బాగా యాక్టివ్ గా ఉండగా.. కమెడియన్ అలీ, పోసాని కృష్ణమురళిలకు ఎలాంటి పదవులు ఇవ్వకపోవడంతో వైసీపీలో మొన్నటివరకు అసంతృప్తిగా ఉన్నారు. గత ఎన్నికలకు ముందు అలీ, పోసాని కృష్ణమురళి వైసీపీలో చేరారు. జగన్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు.

 

పోసాని కృష్ణమురళి అయితే మీడియా సమావేశలతో చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. బాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలంగా తన వాయిస్ వినిపించారు. ఇక అలీ కూడా జగన్ తరపున ప్రచారం చేశారు. ఈ క్రమంలో తన స్నేహితుడైన పవన్ కల్యాణ్ పై కూడా అలీ విమర్శలు చేయాల్సి ఉంది. దీంతో అలీపై పవన్ అభిమానును విరుచుకుపడ్డారు. అలీ, పవన్ స్నేహం పూర్తిగా చెడిపోయింది.వారిద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చింది. ఇంతకుముందు ఉన్నంత స్నేహం ఇద్దరి మధ్య లేదు.

 

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఎలాంటి నామినేటెడ్ పదవులు ఇవ్వకపోవడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. అలీకి రాజ్యసభ పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. అలీ సతీసమేతంగా వెళ్లి సీఎం జగన్ ను కలిశారు. రాజ్యసభ పదవి ఇస్తారని మీడియాకు కూడా చెప్పారు. కానీ అనూహ్యంగా ఆయనకు కాకుండా వైసీపీ నుంచి టాలీవుడ్ నిర్మాత ఒకరికి వైసీపీ రాజ్యసభ పదవి అప్పగించింది. ఆ తర్వాత నుంచి వైసీపీలో సైలెంట్ గా ఉన్న అలీ.. ఆ పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఆ పార్టీకి అంటీముంటనట్లుగా ఉంటున్నారు.

 

కానీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో వైసీపీకి టాలీవుడ్ నుంచి మద్దతు కోసం జగన్ ఇప్పుడు ప్రయత్నాలు మొదలుపెట్టారు. టాలీవుడ్ నుంచి వైసీపీకి సపోర్ట్ చేస్తున్న వారికి పదవులు ఇచ్చే పనిలో పడ్డారు. ఇటీవల అలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు పదవి ఇవ్వగా.. తాజాగా పోసాని కృష్ణమురళికి ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పదవి ఇచ్చారు. దాదాపు ఎన్నికలకు ఏడాదిన్నర ముందు వీరికి పదవులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మూడున్నరేళ్లుగా పార్టీలో ఉన్నా.. వారిని పట్టించుకోని జగన్ ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చి పదవులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

 

ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ లో సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం బాగా జరుగుతోంది. ఇప్పుడు అలీ, పోసాని కృష్ణమురళిలకు నామినేటెడ్ పదవులు ఇవ్వడం, నియోజకవర్గాల వారీగా పార్టీల నేతలతో సమీక్షలు నిర్వహిస్తుండటంతో.. ముందస్తు ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ కూడా పలుమార్లు ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందని కామెంట్లు చేశారు. గత కొంతకాలంగా ముందస్తు ఎన్నికలపై చర్చ జరుగుతోంది.

Related Articles

ట్రేండింగ్

Note for Vote Case: ఓటుకు నోటు కేసును కావాలనే తెరపైకి తెస్తున్నారా.. చంద్రబాబును కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

Note for Vote Case:  ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే. ఇలా ఓటుకు నోటు కేసులో భాగంగా చంద్రబాబు నాయుడు రేవంత్...
- Advertisement -
- Advertisement -