AP News: జగన్ సర్కార్ జాగ్రత్త పడాల్సిందే.. ఆ అప్పులకు లెక్క చెప్పాల్సిందే!

AP News: ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి జగన్ సర్కార్ పెద్ద ఎత్తున అప్పులను చేస్తూ దివాలా తీసింది అని తెలుస్తుంది. ఏపీ ప్రభుత్వం దివాలా తీసింది అనడానికి ఎన్నో ప్రత్యక్ష సాక్షాలు ఉన్నాయి.ప్రస్తుతం నెలనెలా ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్బిఐని అప్పు అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా అప్పుచేసి ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నారు.

ఇలా తరచు ఆర్బిఐని అప్పు అడుగుతుంటే మరో రెండు నెలల తర్వాత ఆర్బిఐ కూడా అప్పు ఇవ్వడానికి వెనుకడుగు వేస్తుంది. ఆర్బిఐ పక్షంలో ఢిల్లీ వరకు వెళ్లి కేంద్రం కాళ్ళ వేళ్ళపడి మేము రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏమాత్రం అడగమని తమకు అప్పు ఒకటే ఇస్తే చాలు అని బ్రతిమిలాడాల్సిన పరిస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందని చెప్పాలి. కార్పొరేషన్ల పేరు పెట్టి విచ్చలవిడిగా బయటకు కనిపించని రుణాలు చేసిన ప్రభుత్వం ప్రస్తుతం సాగునీటి పథకాల పేరిట రుణాలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.

 

అయితే ఈ రుణాలన్నీ ప్రాజెక్టులకు ఉపయోగిస్తారా లేక సంక్షేమ పథకాల కోసం మల్లిస్తారా అనేది తెలియదు కానీ పెద్ద ఎత్తున రుణాలు తీసుకుంటున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ.. ప్రజా ఆస్తి ఏ ఒక్కటి కనిపించినా తాకట్టు పెట్టేస్తున్నారు. అలాగే ప్రభుత్వం తరఫున ఏదైనా కాంట్రాక్టు తీసుకొని పనులు చేసినప్పటికీ ఏ ఒక్కరికి కూడా బిల్లులు పడకపోవడం గమనార్హం. బిల్లు కోసం కూడా కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏపీలో చోటుచేసుకుంది.

 

మరి కొంతమంది కాంట్రాక్టర్లు కేంద్ర ప్రభుత్వానికి తమ బాధలను చెప్పుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం హయాంలో ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడుతున్న సందర్భాలు కళ్లకు కట్టినట్టు కనపడుతున్నాయి. ఏపీని ఆర్థికంగా దివాళి తీయడమే కాకుండా కోలుకోలేని దెబ్బ జగన్ సర్కార్ కొట్టిందని చెప్పాలి. అయితే ఇప్పటికైనా జగన్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు ఏపీ పరిస్థితిని తెలియజేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -