Jagan: జగన్ కు ఇంతమంది ఎమ్మెల్యేలు షాకిచ్చారా.. ఏం జరిగిందంటే?

Jagan: తాజాగా సోమవారం రోజు తాడేపల్లిలో సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో కీలక సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి ముగ్గురు మంత్రులు నలుగురు ఎమ్మెల్యేలతో సహా మరికొందరు మొహం చాటి చేసినట్టు తెలుస్తోంది. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, హోమ్ మంత్రి విడదల రజని, ఎమ్మెల్యేలు ఆళ్ళ రామకృష్ణా రెడ్డి, వల్లభనేని వంశీ, కొడాలి నాని తో పాటు తదితరులు సమావేశానికి హాజరు కాలేదు.

తమ పార్టీ అధినేత, సీఎం జగన్ స్వయంగా నిర్వహిస్తున్న ఈ సమావేశం చాలా కీలకమని తెలిసి ఉన్నప్పటికీ కూడా ఇంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు మొహం చాటేయడం అసంతృప్తిని తెలియజేసినట్లే అని భావించవచ్చు. అయితే సమావేశానికి రాని వారిలో మంత్రి బుగ్గన తలకు కరోనా సోకడం వల్ల తన సమావేశానికి రాలేకపోతున్నట్లు ముందుగా తెలిపినట్లు తెలుస్తోంది. కానీ మిగిలిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఆ సమావేశానికి హాజరు కాలేదు.

 

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ నాలుగు స్థానాలలో ఓడిపోవడం సీఎం జగన్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తారని అందువల్లే ఎమ్మెల్యేలు మంత్రులు ఆ సమావేశానికి హాజరు కాలేదని తెలుస్తోంది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మొదట్లో హుషారుగా మీడియా ముందుకు వచ్చి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేసేవారు. కోర్టులలో కేసులు వేస్తూ హడావుడి చేస్తుండేవారు. కానీ రాజధాని విషయంలో అధినేత తీరుతో నియోజకవర్గంలో నానాటికీ వ్యతిరేకత పెరుగుతుండటంతో ఆయన సైలెంట్ అయిపోయారు.

 

ప్రస్తుతం ఆయన హడావిడి ఏ మాత్రం కనిపించడం లేదు. దాంతో ఆ కారణంగానే అందరూ డుమ్మా కొట్టారేమో అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం జగన్ చివాట్లు పెడతారు, టికెట్స్ ఇవ్వాలని హెచ్చరిస్తారన్న కారణంతో చాలామంది డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. కాగా ఈ సమావేశంలో సిఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలు, మంత్రివర్గ విస్తరణపై మీడియాలో వస్తున్నవన్నీ పుకార్లే అని కొట్టిపాడేశారు. ఎప్పటిలాగే తన ప్రభుత్వం, పాలన గొప్పదనం, దాంతో రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పుకొన్నాక వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ నిత్యం ప్రజల మద్యనే ఉండాలని మరోసారి హెచ్చరించారు.

 

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -