Eenadu: ఈనాడుకు భారీ షాకిచ్చిన జగన్.. ఇక జన్మలో కోలుకోలేదు అనేలా?

Eenadu: ఈనాడు కి కాంగ్రెస్ పార్టీకి ఉన్న జగడం ఈనాటిది కాదు. ఈనాడు తెలుగుదేశం యొక్క ఆస్థాన పత్రిక అని అందరికీ తెలిసిందే. తెలుగుదేశంతో పొత్తులు కలిగి ఉన్నందుకు రామోజీరావుని నానా అగచాట్లు గురి చేసింది జగన్ ప్రభుత్వం. ఆఖరికి సిబిఐ దాడులు కూడా నిర్వహించి రామోజీరావుని దెబ్బతీయాలని చూసింది.

ఇక ఆఖరి అస్త్రంగా ఫుల్ పేజ్ ప్రభుత్వ ప్రకటనలు ఈనాడు పేపర్ జగన్ ప్రభుత్వం ఇవ్వద్దు అన్నట్లుగా ప్రచారం సాగుతుంది. ఈనాడు కి జగన్ మార్క్ షాక్ తగిలిందంటూ స్వయం తృప్తి పొందుతున్నారు వైసిపి మద్దతుదారులు. ఈనాడు పేపర్ కి గవర్నమెంట్ ఫుల్ పేజ్ యాడ్స్ ఆగిపోయిన మాట నిజమే కానీ అది జగన్ చెప్పడం వల్ల కాదు.

 

ఈనాడు యాజమాన్యమే యాడ్స్ ని నిరాకరించినట్లుగా పక్కా సమాచారం. ఒకవేళ ఈనాడుకి యాడ్స్ ఇవ్వొద్దు అని జగన్ చెప్పిన మాట నిజమే అయితే కచ్చితంగా ఆయన చిక్కుల్లో పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక న్యూస్ పేపర్ ని అలా పక్కన పెట్టే అధికారం ఏ గవర్నమెంట్ కి ఉండదు. అలా ఏదైనా న్యూస్ పేపర్ పై పక్షపాతం చూపించినట్లుగా రుజువైతే ప్రభుత్వం చట్టపరమైన చిక్కుల్లో పడవలసి ఉంటుంది.

 

అందుకే గత నాలుగు ఏళ్ల నుంచి ఈనాడు పై అనేక కక్ష సాధింపు చర్యలు చేపట్టినప్పటికీ గవర్నమెంట్ కి సంబంధించిన ఫుల్ పేజ్ ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు. ఈనాడు అధికారికంగా గవర్నమెంట్ ప్రకటనలు వద్దు అని చెప్పింది కాబట్టే గవర్నమెంట్ ప్రకటనలు ఇవ్వడం ఆపేసింది. ఈనాడు యాజమాన్యం ఎందుకు అలా చేసిందనే దానిపై త్వరలో సంచలన విషయాలను బయట పెట్టబోతుందని సమాచారం.

 

ప్రభుత్వ యాడ్స్ కనిపించినప్పుడు లూజ్ సేల్స్ దారుణంగా పడిపోతున్నాయి అందుకే ఏడాదికి 40 కోట్లు నష్టం వస్తున్నా సరే ఈనాడు యాజమాన్యం భరించడానికి సిద్ధపడింది కానీ ప్రకటనలు తీసుకోవడానికి ఇష్టపడలేదు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయని జగన్.. ఇంతకంటే ఘోరం ఉందా?

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో భాగంగా పాదయాత్ర చేస్తూ ఎన్నో హామీలను ఇచ్చారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు భారీ స్థాయిలో ఎన్నికల హామీలను ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి...
- Advertisement -
- Advertisement -