Y. S. Sharmila: కేసీఆర్, కేటీఆర్ పై జగన్ చెల్లి సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

Y. S. Sharmila: తెలంగాణలో షర్మిల పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈమె నిరుద్యోగ యువతకు తన మద్దతు తెలుపుతూ నిరుద్యోగుల గురించి తెలంగాణ సర్కార్ ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ తరచూ కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నేపథ్యంలోనే ఈమె పాదయాత్రకు కూడా అనుమతి ఇవ్వకుండా కట్టడి చేశారు.

ఇలా పాదయాత్రకు పర్మిషన్ లేకపోవడంతో ఈమె సోషల్ మీడియా వేదికగా తన వాదనను వినిపిస్తున్నారు.ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా షర్మిల మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన తనయుడు కేటీఆర్ గురించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.ముఖ్యంగా నిరుద్యోగ యువత గురించి ఈమె మాట్లాడటమే కాకుండా తెలంగాణ సర్కారు ఒక జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయలేదు అంటూ మండిపడ్డారు.

 

గ్రూప్ వన్ పరీక్ష రాయొద్దండి ప్రత్యేక తెలంగాణలో రాసుకుందాం అంటూ నిరుద్యోగ యువతను మభ్యపెట్టింది మీరు కాదా…తొమ్మిదేండ్లుగా ఒక్క గ్రూప్-1 ఉద్యోగాలు ఇవ్వడం చేతకాని దద్దమ్మ కేసీఆర్‌ కాదా? కొలువులు ఇవ్వకుండా వందలాది మంది నిరుద్యోగుల ఉసురుతీసిన ఘనత కేసీఆర్‌ది కాదా? ఆత్మహత్య చేసుకున్న ఒక్క కుటుంబాన్నైనా పరామర్శించారా? అంటూ ప్రశ్నలపై ప్రశ్నలు వేస్తూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

 

బిస్వాల్ కమిటీ లక్షా 91వేల ఖాళీలు ఉన్నాయన్నది వాస్తవం కాదా? దేశంలో ఎంప్లాయ్ మెంట్ పాలసీ తీసుకురావాలని మంత్రి కేటీఆర్ ఎందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం లేదు అంటూ ప్రశ్నించారు. TSPSC ప్రశ్నాపత్రాలకు డిజిటల్ సెక్యూరిటీ కల్పించకపోవడం ఐటీ మంత్రిగా మీ ఫెయిల్యూర్ కు నిలవెత్తు నిదర్శనం అంటూ ఈమె మంత్రి కేటీఆర్ పై కూడా నిప్పులు చెరుగుతూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలా నిరుద్యోగ యువత జీవితంతో ఆడుకున్నందుకు వారికి క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు.

Related Articles

ట్రేండింగ్

Janasena: జనసైనికులను రెచ్చగొట్టే విధంగా వైసీపీ వ్యూహాలు.. ఈ వ్యూహాల వల్ల ఫలితం ఉంటుందా?

Janasena: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీ నేతలు కూడా అభ్యర్థులను ప్రకటించే ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం జనసేన కూటమి...
- Advertisement -
- Advertisement -