Jagga Reddy: ఖరీదైన షర్ట్ తో జగ్గారెడ్డి హల్ చల్.న. రాహుల్ కి బాగానే పోటీ ఇస్తున్నారుగా..

Jagga Reddy:  సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంటే తెలంగాణ రాజకీయాల్లో తెలియని వారు ఎవరూ ఉండరని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మాస్ లీడర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఎప్పుడూ ఏదోక వివాదంతో ఆయన వార్తల్లో ఉంటూ ఉంటారు. ఆయన వెంటే వివాదాలు నడుస్తూ ఉంటాయి. సొంత పార్టీపై విమర్శలు చేస్తూ రచ్చకెక్కుతూ ఉంటారు. ఎప్పుడో సంచలన వ్యాఖ్యలు, ప్రకటనలతో మీడియాలోకి ఎక్కుతూ ఉంటారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఒంటికాలిపై లేసే జగ్గారెడ్డి.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకకు పూర్తిగా దూరమయ్యారు.

అంతేకాదు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనంటూ ఇటీవల సంచలన ప్రకటన చేశారు. తన తరుపున సంగారెడ్డికి చెందని కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైనా ముందుకు వస్తే పోటీ చేయిస్తానన్నారు. ఎవరూ ముందకు రాకపోతే తన భార్యను కాంగ్రెస్ తరపున పోటీలోకి దింపుతానంటూ సంచలన ప్రకటన చేశారు. అయతే ఎప్పుడూ రాజకీయపరంగానే వార్తల్లో ఉండే జగ్గారెడ్డి.. ఈ సారి కాస్త భిన్నంగా , వెరైటీగా టాపిక్ తో వార్తల్లోకి ఎక్కారు.

జగ్గారెడ్డి షర్ట్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఆయన ధరించిన చొక్కా ధర సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. తాజగా జరిగిన అసెంబ్లీ సమావేశాలకు జగ్గారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీకి ఆయన వేసుకొచ్చిన షర్ట్ పై అందరి దృష్టి పెట్టింది. జగ్గారెడ్డి ఎప్పుడూ సాధారణ దుస్తుల్లో కనిపిస్తారు. కానీ ఈ సారి అత్యంత ఖరీదైన కెన్జో షర్ట్ ధరించి అసెంబ్లీలో కనిపించారు. ఎప్పుడూ తెలుగు రంగు షర్ట్ లేదా టీ షర్ట్ ధరించే జగ్గారెడ్డి.. ఈ సారి క్యాజువల్ షర్ట్ లో రావడంతో ఆయనపై అందరి దృష్టి పడింది.

మీడియా దృష్టి కూడా ఆయన షర్ట్ పై పడింది. దీంతో కొంతమంది మీడియా ప్రతినిధులు సరదాగా షర్ట్ ధర ఎంత అని అడిగారు. దీనికి జగ్గారెడ్డి రూ.35 వేలు అని టక్కున సమాధానం చెప్పారు. దీంతో మీడియా ప్రతినిధులు ఆశ్చర్యపోయారు.. వామ్మో ఇంత ధర ఉంటుందా అని ఆయనను ప్రశ్నించారు. దీంతో ఏమైనా అనుమానాలు ఉంటే గూగుల్ లోకి వెళ్లి చెక్ చేసుకోండి అంటూ సమాధానమిచ్చారు.

ఏం నేను అత్యంత ధర కలిగిన షర్ట్ వేసుకోకూడదా.. జీవన్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే వేసుకోవాలని అంటూ రియాక్ట్ అయ్యారు. ఇది తన షర్ట్ కాదని, తన చొక్కాలు లేకపోవడంతో తన కుమారుడి షర్ట్ వేసుకుని వచ్చానంటూ జగ్గారెడ్డి చివరికి బయటపెట్టాడు. మీడియా ప్రతినిధులు షర్ట్ బ్రాండ్, ధరను గూగుల్ లో సెర్చ్ చేయగా.. రూ.40 వేలపైననే ధర ఉంది. దీంతో సాధారణ దుస్తుల్లో ఎప్పుడూ కనిపించే జగ్గారెడ్డి కూడా హైప్రొఫైల్ మెయింటెన్ చేస్తుున్నారని మీడియా ప్రతినిధులు లోలోపల గుసగుసలాడుకున్నారు.

ఇటీవల రాహుల్ చేపడుతున్న భారత్ జోడో పాదయాత్రలో భాగంగా ఆయన ధరించిన టీ షర్ట్ పై రచ్చ జరిగిన విషయం తెలిసిందే. ఆయన టీ షర్ట్ ధర ర.45 వేలు అని బీజేపీ తన అధికారిక సోషల్ మీడియాలో అకౌంట్ల ో పోస్ట్ పెట్టడం దుమారం రేపింది. సామాన్య ప్రజలను కలుసుకుంటు ఉన్న రాహుల్ తన పాదయాత్రలో ఇంత లగ్జరీ దుస్తులు వాడుతున్నారని బీజేపీ ఆరోపణలు చేసింది. దీనికి కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ కూడా గట్టి కౌంటర్ ఇచ్చింది. మోదీ వేసుకునే షూట్లు లక్షల్లో ఉంటాయని, మోదీ ప్రజాధనంతో ఖరీదైన దుస్తులు కొనుగోలు చేసి వేసుకుంటున్నారని విమర్శలు చేసింది.

రాహుల్ ఖరీదైన దుస్తులు వేసుకోకూడదా.. అది ఏమన్నా తప్పా అని కాంగ్రెస్ ఎదురు ప్రశ్నించింది. మోదీలా ప్రజాధనంతో ఎంజాయ్ చేయడం లేదని విమర్శలు చేసింది. ఈ క్రమంలో జగ్గారెడ్డి షర్ట్ గురించి చర్చ రావడం ఆసక్తికరంగా మారింది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -