JaiBalayya Song: బాలయ్య, తమన్‌లపై దారుణమైన ట్రోల్స్.. అలా కామెంట్లు చేస్తూ?

JaiBalayya Song: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా ‘వీరసింహారెడ్డి’. పవర్‌ఫుల్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా సినిమా తెరకెక్కబోతుంది. బాలకృష్ణ 107వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ సోషల్ మీడియాలో ట్రెండీగా నిలుస్తున్నాయి. ఇప్పటివరకు చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా శృతిహాసన్ నటిస్తోంది. కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ కూడా ఈ సినిమాతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అలాగే ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్‌ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. వీరితోపాటు హనీ రాజ్, రవిశంకర్ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు.

 

తాజాగా ‘వీరసింహారెడ్డి’ సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగిల్ రూపంలో ‘జై బాలయ్య’ సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ రిలీజై.. నందమూరి ఫ్యాన్స్ లో చెప్పలేని జోష్ పెంచేసింది. బాలయ్య బాబు ఇమేజ్, మాస్ యాంగిల్‌కు సెట్ అయ్యేలా లిరిక్స్ ఉన్నాయి. ఈ పాటను విన్న బాలయ్య బాబు అభిమానులకు గూస్ బంప్స్ వచ్చాయి. రామజోగయ్య శాస్త్రి ఎంతో అద్భుతంగా లిరిక్స్ రాశారని ఫ్యాన్స్ పొగుడుతున్నారు. అలాగే ఈ పాటలో బాలయ్య లుక్ కూడా అదిరిపోయింది. బాలయ్య మెడలో గోల్డ్ చైన్, చేతికి వాచ్ ధరించుకుని వైట్ అండ్ వైట్ డ్రెస్సులో స్టైలిష్‌గా కనిపించారు. స్టైలిష్ గాగుల్స్ ధరించుకుని బాలయ్య వేసిన స్టెప్పులు ఫ్యాన్స్ కు కనులవిందు చేస్తున్నాయి.

 

అయితే మరోవైపు థమన్ మరోసారి ట్యూన్ కాపీ చేశాడంటూ మీమర్స్ ట్రోల్ చేస్తున్నారు. బాలయ్య సాంగ్.. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటించిన ‘ఒసేయ్ రాములమ్మ’ చిత్రంలోని టైటిల్ సాంగ్‌లా ఉందని చెబుతున్నారు. సేమ్ టు సేమ్ అదే సాంగ్‌ ట్యూన్ కాపీ చేసి.. ‘జై బాలయ్య’ అని పెట్టారని పేర్కొన్నారు. ఇక డైరెక్ట్ గా సంగీత దర్శకుడు తమన్‌పై మరోసారి వార్‌కి దిగారు. మళ్లీ లిరిక్స్ కాపీ చేసినట్లు.. దానికి తగ్గట్లు మీమ్స్ క్రియేట్ చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన మీమ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -