Jaipur Couple: వ్యర్థ పదార్థాలతో కోట్లు టర్నోవర్ చేస్తున్న జంట.. ఎందరికో స్ఫూర్తి?

Jaipur Couple: ఈ ప్రపంచంలో పనికిరానిదంటూ ఏదీ ఉండదు. సరైన మార్గంలో ఆలోచిస్తే ఎన్నో పనికిరాని వస్తువులను కూడా ఉపయోగపడే వాటిగా తయారు చేసే స్థాయికి మన టెక్నాలజీ ఎదిగింది. అయితే సరైన ఆలోచన అనుసరించే విధానం తెలిస్తే ఈ ప్రపంచంలో వృధా అంటూ ఏదీ ఉండదు. ఇలా వ్యర్థ పదార్థాలుగా పడి ఉన్నటువంటి కోడి ఈకలతో మంచి బిజినెస్ స్థాపించి సంవత్సరానికి కోట్లలో టర్నోవర్ సాధిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు ఈ జంట.

జైపూర్ కి చెందిన ముదిత, రాధేష్ శ్రీవాస్తవ దంపతులు.. పెళ్లి కాక ముందు కలిసే జైపూర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైనింగ్ కోర్సులో ఎం ఏ పూర్తి చేశారు. ఈ క్రమంలోనే ఒకరోజు రాధేష్ చికెన్ మార్కెట్ దగ్గరకు వెళ్ళగా.. అక్కడ వృధాగా పడేస్తున్నటువంటి కోడి ఈకలను చూశారు. అయితే రాధేష్ వాటిని చేతితో తాకగా ఆయన మెదడులో ఒక ఆలోచన తట్టింది. ఇలా స్మూత్ గా ఉన్నటువంటి కోడి ఈకలతో బిజినెస్ ప్రారంభిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన రాగ ఈ ఆలోచనను ముదితతో చెప్పారు.

ఈ క్రమంలోనే వీరిద్దరూ ఈ బిజినెస్ స్థాపించాలని చూసినప్పటికీ వీరి కుటుంబ సభ్యులు పూర్తిగా శాఖాహారులు కావడంతో ఈ బిజినెస్ ను చేయడానికి అంగీకరించకపోవడం కాకుండా వీరికి ఎలాంటి ఆర్థిక సహాయం కూడా అందించలేదు. అలాగే కోడి ఈకలతో బిజినెస్ అంటే అందరూ వీరిని ఎగతాళి చేసి మాట్లాడారు అయితే ఈ జంట మాత్రం వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా సరికొత్త టెక్నాలజీతో కోడి ఈకలతో స్కార్ఫ్, మఫ్లర్లు, సాలువలు తయారు చేశారు.

మొత్తానికి ఈ జంట అనుకున్న విధంగానే కోడి ఈకలతో దుస్తులు తయారు చేసినప్పటికీ వాటిని ఎలా బిజినెస్ చేయాలి అనే విషయంలో సందిగ్ధత నెలకొంది.అయితే వీటికి విదేశాలలో మంచి ఆదరణ లభిస్తుందని తెలియడంతో విదేశాలకు ఎగుమతి చేసి బిజినెస్ ప్రారంభించారు. ఇలా వీరి ఆలోచన అమలులోకి వచ్చి మంచి లాభాలను తీసుకునేసరికి దాదాపు 8 సంవత్సరాలు సమయం పట్టింది. ఇలా ఎన్నో అవమానాల మధ్య ఎన్నో విమర్శల నడుమ ఈ జంట ఈ బిజినెస్ ప్రారంభించగా నేడు ఒక ఏడాదికి రెండున్నర కోట్ల రూపాయల టర్నోవర్ అవుతుంది.అయితే ఒకప్పుడు విమర్శించిన వాళ్లే ఇప్పుడు ఈ జంట పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కు ఎక్కువ సీట్లు ఇచ్చే ఆలోచన లేదా.. ఏం జరిగిందంటే?

Pawan Kalyan: ఏపీలో తాజాగా జరిగిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ హవానే...
- Advertisement -