TDP-Jana Sena: టీడీపీ-జనసేన పొత్తు… ఒక్క కండీషన్ పెట్టిన జనసైనికులు

TDP-Jana Sena: ఏపీ రాజకీయాల్లో పొత్తుల అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటినుంచే పొత్తులపై జోరుగా చర్చ జరుగుతోంది. జగన్ ను గద్దె దించేందుకు పార్టీలన్నీ ఇప్పటినుంచే పొత్తులను తెరపైకి తీసుకొచ్చాయి. జగన్ కు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుునేందుకు పార్టీలన్నీ కలిసి రావాలని, అందరం కలిసి పనిస్తామంటూ చంద్రబాబు, పవన్ చెబుతున్నారు. విశాఖలో పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమం నిర్వహించుకోడానికి పోలీసులు అనుమతి నిరాకరించడం, జనసేన కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలోని నోవాటెల్ హోటలో పవన్ ను కలిసి చంద్రబాబు మద్దతు ప్రకటించారు.

అనంతరం చంద్రబాబు, పవన్ కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పొత్తుల గురించి ఇప్పుడే చర్చించుకోలేదని, ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపడటానికి కలిసి పనిచేస్తామని తెలిపారు. అవసరమైతే అందరినీ కలుపుకుని పోరాటం కొనసాగిస్తామని, ఇంకో 10 సార్లు అయినా కలిసి కూర్చోని చర్చిస్తామని చెప్పారు. దాదాపు 5 ఏళ్ల తర్వాత పవన్, చంద్రబాబు కలవడంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. సీట్ల కేటాయింపు గురించి కూడా రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. సీట్ల ఒప్పందం కూడా జరగుతుందని ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. గతంలో 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు పవన్ మద్దతిచ్చారని, పవన్ ఎలాంటి పదవులు ఆశించలేదని అప్పటి విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ సారి టీడీపీతో పొత్తు పెట్టుకుంటే పవన్ కు సీఎంగా అవకాశం ఇవ్వాలని జనసేనికులు కోరుతున్నారు. తాజాగా నాగబాబు ట్విట్టర్ లో ఆస్క్ నాగబాబు పేరుతో అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా జనసైనికులు ఆయనను పలు ప్రశ్నలు అడిగారు. ముఖ్యంగా టీడీపీతో పొత్తు పెట్టుకుంటే సీఎం అబ్యర్ధిగా పవన్ ను ప్రకటించాలనే షరతు పెట్టాలని జనసైనికులు కోరారు.

ఇక పవన్ కల్యాణ్ బస్సు యాత్ర ఎప్పుడు ప్రారంభం అవుతుంది.. చిరంజీవి జనసేనకు మద్దతుగా ఉన్నారని ప్రచారం చేస్తారా అనే విషయాలను నాగబాుబును జనసైనికులు అడిగారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తమకు ఓకే కానీ.. సీఎం అభ్యర్ధిగా పవన్ ఉండాలని జనసైనికులు కోరుతున్నారు. దీంతో ఈ విషయాన్ని పవన్ దృష్టికి నాగబాబు తీసుకెళ్లనున్నారు. అయితే టీడీపీ వర్గాలు దీనికి ఒప్పుకకునే అవకాశాలు ఉండవు. ప్రధాన ప్రతిపక్షంగా ఏపీలో టీడీపీ ఉంది. జనసేన కంటే టీడీపీ ఎక్కువ బలంగా ఉంది. అలాంటప్పుడు పవన్ కు సీఎం అవకాశం ఇచ్చేది ఉండదని అంటున్నారు. చంద్రబాబు లాంటి సీనియర్ పొలిటీషియన్ ఉండగా.. పవన్ కు సీఎంగా ఎలా అవకాశం ఇస్తారని అంటున్నారు.

పవన్ కల్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి టీడీపీ వర్గాలు కూడా ఒప్పుకోవు. పొత్తుతైనా టీడీపీ నేతలు వదులుకుంటారు ఏమో కానీ పవన్ కు సీఎంగా అవకాశం ఇచ్చేది ఉండదు. అలాంటప్పుడు డిప్యూటీ సీఎం పదవి, మంత్రి పదవులు తీసుకోడం తప్ప జనసేనకు వేరే రూట్ ఏమీ లేదు. జగన్ ను ఎలాగైనా అధికారంలోకి దించుతానని, దానికోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్దమని పవన్ చెబుతున్నారు. దీంతో టీడీపీతో ఎలాగైనా కలిసేందుకు పవన్ మొగ్గు చూపుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Namrata Shirodkar: రోజురోజుకూ మహేష్ భార్య చిన్నపిల్లవుతోంది.. 50 ఏళ్ల వయస్సులో ఇదేం అందమంటూ?

Namrata Shirodkar:  మనకు వయసు పైబడే కొద్ది మన అందం కూడా తగ్గుతుందని చెప్పాలి. ఇలా వయసు పైబడిన కొద్ది అందం కాపాడటం కోసం సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కష్టపడుతూ ఉంటారు కానీ...
- Advertisement -
- Advertisement -