Janasena: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో ఆయనని పరామర్శించడానికి వెళ్లినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాదాపు 45 నిమిషాల పాటు చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన అనంతరం ఈయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇలా మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో తాను టిడిపి తో పాటు పోటికి దిగుతున్నానని తెలిపారు. ఇలా టిడిపి తో పొత్తు ఖాయమైందని ఈయన అధికారకంగా వెల్లడించారు.
ఈ విధంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ టిడిపి పార్టీతో పొత్తు ఖాయమైందని వార్త తెలియజేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందినవారు పవన్ కళ్యాణ్ నిర్ణయంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇన్ని రోజులు తమ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి సీఎం పదవికి పోటీ చేయబోతున్నారని తెలిసి సంతోషం వ్యక్తం చేసాము ఇక పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచాము.
ఇలా పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేసినటువంటి తరుణంలో ఈయన వెళ్లి టిడిపికే సానుకూలంగా పనిచేస్తానని చెప్పడం వల్ల మా ఓట్లు తప్పనిసరిగా ఈ పార్టీకి వేయమని కరాకండిగా చెప్పేస్తున్నారు. అయితే టిడిపితో పొత్తు పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ రెండున్నర సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా అధికార పీఠంలో ఉంటామని ప్రకటిస్తేనే తమ ఓట్లు పవన్ కళ్యాణ్ కు వస్తాయని లేకపోతే జనసేన పార్టీకి కాపు సామాజిక వర్గపు ఓట్లు దూరం కావాల్సి ఉంటుందని తెలియజేస్తున్నారు.
గత 60 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు కేవలం రెండు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల మధ్య పోటీకి వస్తున్నాయి. ఇలా కమ్మ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించి కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కూడా ముఖ్య మంత్రి రేస్ లో ఉన్నామని తెలియజేశారు. దీంతో తమ సామాజిక వర్గానికి చెందిన వారికి సపోర్ట్ చేయగా తీర ఆయన పొత్తు పెట్టుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన ముఖ్యమంత్రి అవుతాను అంటేనే ఓట్లు వేస్తామని లేకపోతే కాపు సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లు పవన్ కళ్యాణ్ కు దూరం కావాల్సి ఉంటుందని తెలుపుతున్నారు.