Jangaon: అన్యోన్యంగా ఉన్న ప్రేమ జంట.. కట్ చేస్తే ప్రియురాలు ఆత్మహత్య?

Jangaon: ఈ మధ్యకాలంలో యువత ప్రేమ పేరుతో నిండు నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకోవడంతో పాటు కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. అంతేకాకుండా ప్రేమించిన యువత కోసం చనిపోవడం లేదంటే ఆమెని చంపేయడం ఇలా చంపడం ఏంటి చావడం వరకు కూడా వెళుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒకే మండలం పక్కపక్క గ్రామాలకు చెందిన ఒక యువతి యువకుడు ప్రేమలో పడ్డారు. వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమ వరకు వెళ్ళింది. అందరితో ఆగకుండా ప్రేమించుకుంటూ కొంతకాలం పాటు బాగా తిరిగారు. సినిమాలు షికార్లు అంటూ తిరిగారు. కానీ చివరికి ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది.

 

పూర్తి వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా వడ్లగొండ గ్రామానికి చెందిన కావేరి అనే 19 ఏళ్ళ యువతి ఇంటర్ వరకు చదువుకుంది. ఆ తర్వాత స్థానికంగా ఓ చోట టెలికాలర్ గా పనికి కుదిరింది. అయితే పని చేసే చోట కిర్యాల గ్రామానికి చెందిన అరవింద్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. అలా వీరి పరిచయం కొన్నాళ్ల తర్వాత ప్రేమించుకునే దాక వెళ్లింది. దీంతో ఆ యువకుడు నువ్వంటే ప్రాణం, నువ్వు లేకుండా నేను ఉండలేను అంటూ కావేరి కు మాయమాటలు చెప్పాడు. అలా కొన్నేళ్ల పాటు వీరిద్దరి ప్రేమాయణం బాగానే కొనసాగింది. అయితే ఈ క్రమంలోనే ఆ యువతికి ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. ఇదే విషయాన్ని ప్రియుడు అరవింద్ కు చెప్పడంతో అతడు షాక్ కు అయ్యాడు.

 

అప్పటివరకు నువ్వంటే ఇష్టం, నువ్వంటే ప్రాణం అంటూ మాయమాటలు చెప్పిన అరవింద తీరా పెళ్లి మాట అయితే సరికి నేను నిన్ను పెళ్లి చేసుకోనంటూ అరవింద్ కావేరికి చెప్పాడు. ప్రియుడు ఉన్నట్టుండి అలా చెప్పడంతో కావేరి ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఏం చేయాలో అర్థంకాక తీవ్ర మనస్థాపానికి లోనయ్యింది. దీంతో ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో కావేరి ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుకున్న ఆ యువతి తల్లిదండ్రుల కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక తట్టుకోలేని కావేరి తల్లిదండ్రులు అన్ని వివరాలు తెలుసుకుని ప్రియుడి ఇంటి ముందు బైఠాయించారు. మా కూతురు మరణానికి కారణమైన అరవింద్ ను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pareshan Boys: ముస్లిం అయినా వినాయకుని మండపం పెట్టిన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్.. మనమంతా సమానమంటూ?

Pareshan Boys: సాధారణంగా ఇతర దేవులను కొలిచేవారు హిందూ దేవుళ్ళ వద్దకు రారు హిందూ దేవుళ్లను నమస్కరించరు. అలాగే హిందూ దేవుళ్లకు నైవేద్యంగా పెట్టే ప్రసాదాన్ని కూడా వారు తీసుకోరు. ఇలా హిందువులు...
- Advertisement -
- Advertisement -