Sanjana Ganesan: నువ్వేం పెద్ద అందగత్తెవు కాదు.. బుమ్రాను ఎలా పడేశావ్? సంజనా షాకింగ్ రిప్లై

Sanjana Ganesan: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో ఆడటం లేదు. గాయం కారణంగా అతడు ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అతడు ఆడకున్నా బుమ్రా భార్య సంజనా గణేషన్ మాత్రం తన భర్త వేసే యార్కర్ల కంటే బలమైన పంచ్‌లతో తనను ట్రోల్ చేసిన వారికి దిమ్మతిరిగే సమాధానం చెబుతున్నది. నువ్వేం అందంగా లేవు.. అయినా మా బుమ్రాను ఎలా పడేశావ్..? అని కామెంట్ చేసిన వ్యక్తికి గూబ గుయిమనిపించే రీతిలో రిప్లై ఇచ్చింది.

 

వివరాల్లోకెళ్తే.. టీ20 ప్రపంచకప్ లో ఐసీసీ తరఫున యాంకర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంజన.. తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. దీనికి ఓ నెటిజన్.. ‘మేడమ్, మీరు అంత గొప్ప అందగత్తె కాదు. అయినా బుమ్రాను ఎలా పడేశారు..?’ అని కామెంట్ చేశాడు.

 

దీనికి సంజనా అతడికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ‘చెప్పులాంటి ముఖాలతో కొందరు దేశం మీద పడి తిరగడం లేదా..? అలాగే..!’ అని రిప్లై ఇచ్చింది. ఎదుటివారి గురించి మాట్లాడేప్పుడు అద్దంలో ముఖం చూసుకుని మాట్లాడాలని చెప్పకనే చెప్పింది. సంజనా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సంజనా ఇచ్చిన ఈ ఆన్సర్ తో సదరు వ్యక్తితో పాటు ట్రోలర్స్ అందరికీ ఆమె వార్నింగ్ ఇచ్చిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సెలబ్రిటీలను కామెంట్ చేయడం అందరికీ ఓ ఫ్యాషన్ అయిపోయిందని.. ఇటువంటి చురకలు తగిలితే అయినా ఇలా పిచ్చి వాగుడు వాగే వారి నోటికి అడ్డుకట్ట వేసినట్టు అవుతుందని అంటున్నారు.

తన కామెంట్స్ వైరల్ అయ్యాక కొంతసేపటికి సంజనా స్వయంగా ఓ నోట్ షేర్ చేసింది. తాను ట్రోలర్ కు ఎందుకంత కౌంటర్ ఇవ్వాల్సి వచ్చిందో వివరణ ఇచ్చింది. మీరు ట్రోలర్ అయి ఉంది నెగిటివ్ కామెంట్ ను స్వీకరించలేనప్పుడు తాను ఎందుకు మౌనంగా ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -