Jeevitha Rajasekhar: ఛాన్స్ ఇవ్వాలని అడిగిన జీవిత.. హరీష్ ఏమన్నారంటే?

Jeevitha Rajasekhar: టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలకు అన్యాయం జరుగుతుందని కొంతకాలంగా విమర్శలు వినిపిస్తున్నాయి. టాలెంట్ ఉన్నా మన తెలుగు అమ్మాయిలను సినిమాల్లో తీసుకోకుండా దర్శకులు పరభాషలకు చెందిన వారికి పెద్దపీట వేస్తున్నారు. ముఖ్యంగా ముంబై భామలు టాలీవుడ్‌లో రాజ్యమేలుతున్నారు. అంజలి, బిందు మాధవి, శ్రీదివ్య, స్వాతిరెడ్డి లాంటి వాళ్లు తెలుగు హీరోయిన్‌లే. కానీ వీళ్లకు సినిమాల్లో అంతంత మాత్రంగానే అవకాశాలు వస్తున్నాయి. తాజాగా జీవిత రాజశేఖర్ కుమార్తె శివాత్మిక రాజశేఖర్ కూడా హీరోయిన్‌గా రాణిస్తోంది.

శివాత్మిక రాజశేఖర్ తాజాగా పంచతంత్రం అనే సినిమాలో నటించింది. ఈ మూవీ శుక్రవారం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీవిత రాజశేఖర్, దర్శకుడు హరీష్ శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ తెలుగు హీరోయిన్‌లకు చిత్ర పరిశ్రమలో అన్యాయం జరుగుతోందని.. మనవాళ్లకు కాకుండా ముంబై వాళ్లకు ప్రాముఖ్యత ఇస్తున్నారని జీవిత ఆరోపించింది.

 

పంచతంత్రం సినిమా విషయానికి వస్తే తన కూతురుతో సహా ఐదుగురు తెలుగమ్మాయిలు నటించారని.. ఈ మూవీ అందరికీ కనెక్ట్ అవుతుందని జీవిత రాజశేఖర్ అన్నారు. తెలుగు వారికి అవకాశాలు ఇవ్వాలని ఆమె దర్శకుడు హరీష్ శంకర్‌ను కోరారు. దీంతో పరోక్షంగా తన కుమార్తెలు శివాత్మిక రాజశేఖర్, శివానీలకు తెలుగు సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలని కోరినట్లు ఉందని నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు.

జీవిత వ్యాఖ్యలకు హరీష్ శంకర్ స్పందన

అయితే స్టేజీపై తెలుగు వాళ్లకు అవకాశాలు ఇవ్వాలన్న జీవిత రాజశేఖర్ వ్యాఖ్యలకు దర్శకుడు హరీష్ శంకర్ స్పందించాడు. తన సినిమాల్లో తెలుగు నటీనటులను తీసుకునేందుకు ఇష్టపడతానని.. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా మనవాళ్లకు న్యాయం చేయలేకపోతున్నట్లు హరీష్ వివరించాడు. కాగా ఈ సినిమాలో తాను పోషించిన లేఖ పాత్ర ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ స్పష్టం చేసింది. ఈ సినిమాలో ఐదు కథలను చూస్తుంటే ఐదు సినిమాలను చూస్తున్నట్టుగా ఉంటుందని వివరించింది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -