Jeevitha Rajasekhar: బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్ధిగా జీవితారాజశేఖర్? ఆ నియోజకవర్గం నుంచే పోటీ?

Jeevitha Rajasekhar: సినీ ఇండస్ట్రీ తరపున తన వాయిస్ ను బలంగా వినిపిస్తూ ఉంటారు జీవితారాజశేఖర్. సినీ ఇండస్ట్రీలో ఏవైనా సమస్యలు వచ్చినా ఆమె తెరముందుకు వస్తారు. సినీ ఇండస్ట్రీలో ఏవైనా వివాదాలు వచ్చినా.. ఆమె అందులోకి వస్తారు. సినీ ఇండస్ట్రీలోని వివాదాలు సమస్యల గురించి మాట్లాడేందుకు ఆమె ఎప్పుడూ మీడియా ముందుకు వస్తారు. ఇక జీవితారాజేఖర్ అంటే వివాదాలు కూడా ఉంటాయి. ఆమె చుట్టూ ఎప్పుడు ఏదోక వివాదం నడుస్తూ ఉంటుంది. హీరో రాజశేఖర్ భార్యగా, నటీమణిగా జీవితారాజేఖర్ అందరికీ తెలిసిన వ్యక్తే.

కానీ సినిమాలతో కాకుండా రాజకీయాల పరంగా కూడా జీవితారాజశేఖర్ వార్తల్లో ఉంటూ ఉంటారు. రాజకీయాల్లోకి కూడా జీవితారాజశేఖర్ అడుగుపెట్టారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ, వైసీపీలో జీవితారాజశేఖర్ ఉన్నారు. కానీ చిరంజీవితో గొడవ వల్ల ప్రజారాజ్యం పార్టీ నుంచి, ఆ తర్వాత జగన్ దూరం పెట్టడం వల్ల వైసీపీ పార్టీ నుంచి జీవితారాజశేఖర్ బయటకొచ్చారు. కానీ ఇప్పుడు ఆమె బీజేపీలో చేరి ఆ పార్టీలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ఇరుకున్న సమయంలో కవిత టార్గెట్ గా జీవితా రాజశేఖర్ ఆరోపణలు చేశారు. ఎప్పటినుంచో జీవితరాజశేఖర్ బీజేపీలో ఉన్నా సరే ఆమె పెద్దగా బయటకు రాలేదు. పార్టీకి దూరంగానే ఉంటూ ఉన్నారు.

కానీ కవిత లిక్కర్ స్కాం ఎపిసోడ్ తో ఆమె బయటకు వచ్చి రాజకీయాల్లోకి యాక్టివ్ అయ్యారు. తెలంగాణలో బీజేపీ పార్టీలో యాక్టివ్ వ్ ఉన్నారు. ఇప్పటికే సీనియర్ హీరోయిన్ విజయశాంతి బీజేపీలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇలాటి తరుణంలో జీవితారాజశేఖర్ కూడా యాక్టివ్ కావడం సినీ ఇండస్ట్రీ పరంగా తెలంగాణ బీజేపీకి అనుకూలమైన అంశమే. వచ్చే ఎన్నికల్లో సినీ ఇండస్ట్రీ నుంచి పలువురుని పోటీలోకి దింపాలని బీజేపీ బావిస్తున్నట్లు సమాచారం. దాని వల్ల సినీ గ్లామర్ కూడా కలిసొస్తుందని బీజేపీ వర్గాలు భావిస్తు్నాయి.

ఈ క్రమంలో విజయశాంతి మళ్లీ ఎంపీగా పోటీ చేసే అవకాశముంది. గతంలో ఆమె ఎంపీగా గెలుపొందారు. దీంతో వచ్చే ఎన్నికల్లో కడా బీజేపీ నుంచి విజయశాంతి ఎంపీగా బరిలోకి దిగే అవకాశముంది. ఇక జీవితారాజశేఖర్ కూడా ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు. టీఆర్ఎస్ కు కంచుకోగా ఉన్న జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని ఆమె భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2014,2019 పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ టీఆర్ఎస్ నుంచి బీబీ పాటిల్ ఎంపీగా గెలుపొందారు. అంతుకుముందు 2009 లోక్ సభ ఎన్నికల్లో జహీరాబాద్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ కుమార్ షెట్కర్ గెలుపొందారు.

2019 ఎన్నికల్లో బీజేపీ నుంచి ఇక్కడ బాణాల లక్ష్మారెడ్డి పోటీ చేశారు. గత ఎన్నికల్లో ఆయనకు 1,38,947 ఓట్లు దక్కించుకుని మూడో స్థానంలో నిలిచారు. దీనిని బట్టి చూస్తే జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీకి బలం ఉన్నట్లు అర్థమవతుంది. అందుకే ఇక్కడ నుంచి పోటీ చేయాలని జీవితారాజశేఖర్ నిర్ణయించుున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు అక్కడ నుంచి ఆమెకు టికెట్ ఇచ్చేందుకు బీజేపీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెకు టికెట్ ఫిక్స్ చేసినట్లు తెలంగాణలోబీజేపీలో టాక్ నడుస్తోంది.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా జీవితారాజేఖర్ కు పార్టీలో అండదండలు అందిస్తున్నారు. పార్టీలో ఆయన సపోర్ట్ జీవితారాజశేఖర్ కు ఉంది. దీంతో ఆయన రాయబారంతో జీవితారాజశేఖర్ కు జహీరాబాద్ టికెట్ కన్పామ్ అని చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -