Jeevitha: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రాజశేఖర్, జీవిత దంపతులు మంచి గుర్తుంపును తెచ్చుకున్నారు. ఫ్యామిలీ సెంటిమెంట్ హీరోగా రాజశేఖర్ పాపులర్ అయ్యారు. అలాగే నటిగా, దర్శకురాలిగా జీవిత ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం వారి నట వారసులుగా వారి కూతుర్లు సినీ రంగంలోకి ప్రవేశించారు. దొరసాని సినిమాలో శివాత్మిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఆమె నటించిన మరో సినిమా పంచతంత్రం.
పంచతంత్రం సినిమాలో హాస్య బ్రహ్మా బ్రహ్మానందం కూడా చాలా రోజుల తర్వాత నటించారు. డిసెంబర్ 9వ తేదిన ఈ సినిమా విడుదలైంది. హిట్ టాక్ తో ఈ సినిమా ఆడుతోంది. పంచతండ్రి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జీవిత రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పంచతంత్రం సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో జీవిత రాజశేఖర్ తన కూతుర్ల గురించి పలు విషయాలు చెబుతూ ఎమోషనల్ అయ్యారు. తమ పిల్లలు చిన్నతనం నుంచి సినిమా వాతావరణంలోనే పెరిగారన్నారు. ఆ ప్రభావంతోనే సినిమాల్లో వచ్చినట్లుగా చెప్పుకొచ్చారు. తమ కూతుర్లు సినిమా ఇండస్ట్రీలోకి వస్తాననడంతో తనకు తన భర్త రాజశేఖర్ కు చాలా టెన్షన్ మొదలైందని తెలిపింది.
సినిమా రంగంలో ఎదగాలంటే అంత సులభం కాదని, విజయం వచ్చినా సక్సెస్ రాకపోయినా ఇక్కడ బాధపడకూడని తన పిల్లలకు చెప్పినట్లు తెలిపింది. చిన్నప్పటి నుంచి తమ కూతుర్లకు ఏం కావాలన్నా ఆస్తులు అమ్మి మరీ కొనిచ్చామని, అయితే సినిమాల్లో అంత సులభంగా దేన్ని కొనలేం అని జీవిత తెలిపింది. తమ కూతుర్ల ఇష్టాన్ని గౌరవించి తాను, తన భర్త రాజశేఖర్ సపోర్ట్ ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని, అందుకే వారిని ఎంకరేజ్ చేస్తున్నట్లు తెలిపారు. సినిమా రంగంలో సక్సెస్ పై జీవిత చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరో వైపు మంచి తారాగణంతో తెరకెక్కిన పంచతంత్రం సినిమా ప్రేక్షకాదరణ పొందుతోంది.