Jio: జియో బంపర్ ఆఫర్.. ఆ బెనిఫిట్స్ ను ఎలా పొందాలంటే?

Jio: రిలయన్స్ జియో దేశంలోనే నంబర్ వన్ ప్రైవేట్ టెలికాం దిగ్గజంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ కంపెనీ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ఆఫర్‌లు, ప్లాన్‌ లను ప్రవేశపెడుతోంది. ఇక అందులో భాగంగానే తాజాగా సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది జియో.

388 రోజులు అన్లిమిటెడ్ లాభాలను అందించే బెస్ట్ అఫర్ ఒకటి వుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే జియో కస్టమర్లు 388 రోజులు నిశ్చింతగా ఉండవచ్చు. ఈ ప్లాన్ తో ప్రతీరోజూ 2.5జీబీ హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటు మరిన్ని లాభాలను పొందవచ్చు.

ప్రతిరోజూ కాలింగ్ అలాగే అధిక డేటా అవసరాన్ని కూడా తీర్చగలిగే ఈ బెస్ట్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. జియో 2, 999 ప్లాన్ 365 రోజుల చెల్లుబాటులో వస్తుంది. అలాగే 23 రోజుల అదనపు వ్యాలిడిటీని ఉచితంగా తీసుకు వస్తుంది. ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్ లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 365 వ్యాలిడిటీ తో 23 రోజుల అదనపు వ్యాలిడిటీ తో కలిపి మొత్తం 388 రోజుల వ్యాలిడిటీతో అందిస్తుంది. ఈ మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 2.5 జీబీ హై స్పీడ్ డేటా, 75జీబీ అదనపు డేటా కలుపుకొని మొత్తం 987.5జీబీ ల హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది.

 

దాంతో పాటు అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది. జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది. అంతేకాదు, జియో 5జీ నెట్ వర్క్ అందుబాటులో ఉన్న సమయంలో అన్లిమిటెడ్ 5జీ డేటాని ప్రయోజనాన్ని కూడా ఈ ప్లాన్ తో పొందవచ్చు. తక్కువ ధరలో లాంగ్ వ్యాలిడిటీ అందించే మరొక ప్లాన్ కూడా. అదే జియో 2,023 ప్లాన్ ఈ ప్లాన్ కూడా ప్రతిరోజూ కాలింగ్ అలాగే అధిక డేటా అవసరాన్ని తీర్చగలిగే బెస్ట్ ప్లాన్ గా చెప్పవచ్చు. 2,023 ప్లాన్ ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 252 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 2.5 జీబీ హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 630 జీబీ ల హైస్పీడ్ డేటా తీసుకువస్తుంది. ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -