Jio Phone: అతి తక్కువ ధరకే 5జీ స్మార్ట్ ఫోన్.. ఎంతంటే?

Jio Phone: టెలికాం రంగంలోకి రిలయన్స్ జియో ఇచ్చిన తర్వాత ఆ రంగం రూపురేఖలే మారిపోయాయి. అంతేకాకుండా రిలయన్స్ జియో టెలికాం రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత ఒక ఆలోచన సృష్టించింది. అంతేకాకుండా వినియోగదారులను తమ వైపు తిప్పుకోవడానికి మొదట్లోనే అన్ని సేవలు ఫ్రీ అంటూ అనుకున్న విధంగా కస్టమర్లను తన వైపు మళ్ళించుకోగలిగింది. అలా నెమ్మదిగా డెవలప్ అవుతూ మొత్తంగా దేశంలో టెలికాం సేవలు అందిస్తున్న సంస్థల్లోనే అగ్ర స్థానానికి చేరిపోయింది రిలయన్స్ జియో. మొదట్లో మాత్రమే కాకుండా ఆ తర్వాత కూడా వినియోగదారుల కోసం,  సామాన్యుల కోసం తక్కువ ధరలకే టారిఫ్ లు తీసుకువస్తూ అందుబాటులో ఉంటుంది.

ఇక ఇప్పటికే 4జి ఫోన్లతో వినియోగదారులకు మరింత దగ్గరైన జియో, తాజాగా మరొక సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా దేశ వ్యాప్తంగా 5జి నెట్వర్క్ కవరేజ్ కు సంబంధించిన ప్లానింగ్ జియో పూర్తి చేసుకుందట. ఈ క్రమంలోనే తొలి దశలోనే 13 నగరాల్లో ఈ 5జీ ని ప్రారంభించబోతోందట. ఇక ఇందులో భాగంగానే జియో ఫోన్ 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఈ 5జీ ధర రూ.10 వేలలోపే ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో భారత్‌లో అత్యంత చౌకైన 5జీ మొబైల్ ఇదే కానుంది.

ఇకపోతే గత ఏడాది రిలయన్స్ జియో , గూగుల్ సంయుక్తంగా జియో ఫోన్ నెక్స్ట్‌ను విడుదల చేసిన మనందరికీ తెలిసిందే. ఈ ఏడాది ఆగష్టు 29న జరగనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వార్షిక సాధారణ సమావేశంలో ఈ 5 జీస్మార్ట్‌ ఫోన్‌ ను లాంచ్‌ చేయవచ్చని తెలుస్తోంది. కాగా ఈ 5జీ జియో ఫోన్ ధర 10 వేల నుంచి 12 వేల రూపాయల లోపే ఉంటుందట. అదేవిధంగా జియో ఫోన్ నెక్స్ట్ మాదిరిగానే, వినియోగదారులు రూ. 2500 డౌన్ పేమెంట్ చేసి ఈ జియో 5జీ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చట.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: ఓటమి భయంతోనే జగన్ కు కోపం.. వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు!

Pawan Kalyan: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నటువంటి తరుణంలో అన్ని పార్టీ అధినేతలు ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు ఈ క్రమంలోనే కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇటీవల...
- Advertisement -
- Advertisement -