Job Notification: నిరుద్యోగులకు శుభవార్త.. డిసెంబర్లో 12 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్!

Job Notification: నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు ఎటువంటి నోటిఫికేషన్ లు వస్తుంటాయా అని ఎదురు చూస్తూ ఉంటారు. దీంతో ప్రభుత్వం పై ఆధారపడి ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలన్న ఆలోచనలో బయట ఎన్నో కోర్సులు నేర్చుకొని వచ్చే ప్రభుత్వ నోటిఫికేషన్ ల గురించి ఎదురు చూస్తూ ఉంటారు. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.

 

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాల నోటిఫికేషన్ లను విడతల వారిగా విడుదల చేస్తూ రాగా త్వరలో గురుకుల విద్యా సంస్థల ఖాళీల భర్తీలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రంలో నాలుగు సంక్షేమ గురుకుల సొసైటీ పరిధిలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిసింది.

 

అందులో 9096 బోధన, బోధ నేతర పోస్టులు ఉన్నట్లు సమాచారం. దీంతో ఆ పోస్టుల భర్తీకి తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదు తెలిపారు. అయితే ఈ పోస్టులకు అదనంగా 3000 పోస్టులు కూడా రానున్నట్లు సమాచారం. ఇక ప్రతిపాదన పరిశీలన పూర్తయిన తర్వాత వారంలోపే పోస్టుల వారీగా నోటిఫికేషన్లు ఇవ్వాలని గురుకుల నియామకాల బోర్డు భావించిందని తెలిసింది.

 

ఈ నేపథ్యంలో వచ్చేనెల డిసెంబర్ లో నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉందని తెలిసింది. మొత్తానికి నిరుద్యోగులకు మంచి అవకాశం అందించగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అంటూ తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇక ఇప్పటికే చాలామంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూడగా మొత్తానికి వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పిందని చెప్పవచ్చు.

Related Articles

ట్రేండింగ్

AP Elections: ఏపీ ఎన్నికలలో వారసులు హిట్టా..? ఫట్టా..? ప్రజలు వీరిని ఆదరించడం సాధ్యమేనా?

AP Elections:  ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఈసారి వారసులకు పెద్దపీట వేశారు. ఇప్పటికే అధికార పక్షంలోనూ అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల వారసులకు పలు ప్రాంతాలలో టికెట్లు ఇచ్చారు. ఈ...
- Advertisement -
- Advertisement -