Jonnavithula: మోహన్ బాబుపై షాకింగ్ కామెంట్స్ చేసిన జొన్నవిత్తుల!

Jonnavithula: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పేరు ఉన్న కొన్ని కుటుంబాల్లో మంచు వారి కుటుంబం కూడా ఒకటి. మంచు మోహన్ బాబు వల్ల ఈ కుటుంబానికి పేరు రాగా.. ఇప్పుడు ఈ కుటుంబం పేరు ఎక్కువగా ట్రోల్స్ లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా మంచు వారి కుటుంబానికి చెందిన మంచు మోహన్ బాబు, విష్ణు మరియు లక్ష్మీల చుట్టూ ట్రోల్స్ వస్తుంటాయి.

మోహన్ బాబును టాలీవుడ్ లో కలెక్షన్ కింగ్ అని పిలిచే వారు. అప్పట్లో ఆయన సినిమాలు తీస్తే విపరీతమైన కలెక్షన్లు వచ్చేవి. కానీ ఈ మధ్యన ఆయన సినిమాలు పెద్దగా ఆడకపోగా.. ఆయన కొడుకు మంచు విష్ణు చేస్తున్న సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. అయితే ఓ సినిమా విషయంలో గతంలో జరిగిన సంఘటలన గురించి ప్రముఖ గేయ రచయిత జొన్నవిత్తుల ఆసక్తికర కామెంట్లు చేశారు.

ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన జొన్నవిత్తుల.. ‘దేనికైనా రెడీ’ సినిమా విషయంలో జరిగిన వివాదం గురించి వెల్లడించారు. ఆ సినిమాలో బ్రాహ్మణులను అవమానించేలా డైలాగులు ఉన్నాయని.. తాను ఇదే విషయాన్ని పలు టీవీ ఛానల్స్ చర్చల్లో తెలిపినట్లు వివరించారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలపై కొందరు ఘాటుగా స్పందించారని, తన తల పగలగొడతామని వార్నింగ్ ఇచ్చినట్లు జొన్నవిత్తుల తెలిపారు.

ఆ సినిమాలో బ్రాహ్మణులను కించపరిచేలా చాలా డైలాగులు, సన్నివేశాలు ఉన్నాయని జొన్నవిత్తుల వివరించారు. దానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బ్రాహ్మణులు మోహన బాబుకు పిండాలు, శాపనార్థాలు పెట్టినట్లు ఆయన తెలిపారు. అలాగే తన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేశారని.. ఆ కేసు సమయంలో వచ్చిన మోహన్ బాబు మరియు అతడి కొడుకు మీద ఓ మహిళ చెప్పు విసిరిందని సెన్సేషనల్ కామెంట్లు చేశారు.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -