Aadi Movie: రీ రిలీజ్ కు సిద్ధమైన ఎన్టీఆర్ ఆది.. ఎప్పుడంటే?

Aadi Movie: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకసారి కొత్త ట్రెండ్ నడుస్తుంది. ఒక హీరో నటించి బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాని తిరిగి విడుదల చేయడం ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఈ క్రమంలోనే పోకిరి జల్సా చెన్నకేశవరెడ్డి వంటి సినిమాలు తిరిగి విడుదల అయ్యి అద్భుతమైన కలెక్షన్లను రాబట్టడంతో ఇదే బాటలోనే మరి కొంతమంది హీరోలు నటించిన సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి.

ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరియర్ మొదట్లోనే బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన ఆది సినిమాని తిరిగి విడుదల చేయడానికి మేకర్ ఏర్పాట్లు చేస్తున్నారు. బెల్లంకొండ సురేష్ నిర్మాణంలో వివి వినాయక్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎన్టీఆర్ నటించిన చిత్రం ఆది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో కలెక్షన్ల సునామీ సృష్టించింది.ఈ సినిమాలో అమ్మతోడు అడ్డంగా నరుకుతా అనే డైలాగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుందని చెప్పాలి.

ఇలా బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ సినిమాని తిరిగి విడుదల చేయడానికి నిర్మాతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఇదే నిర్మాణంలో తెరకెక్కిన చెన్నకేశవరెడ్డి సినిమాని తిరిగి విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్న మేకర్స్ తిరిగి ఆది సినిమాని విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈసారి భారీ స్థాయిలో ఈ సినిమాని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

ఇకపోతే ఆది సినిమాని నవంబర్ మూడవ వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే ఈ విషయం గురించి మేకర్స్ అధికారిక ప్రకటన తెలియచేయనున్నారు.ఇక ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు పూర్తి కావడంతో మేకర్స్ ఈ సినిమాని తిరిగి విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇక ఆది సినిమా తిరిగి విడుదల అవుతుందంటే ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలు రావడం గ్యారెంటీ అని చెప్పాలి.ఇప్పటివరకు తిరిగి విడుదలైన సినిమా కలెక్షన్లను మించి ఈ సినిమా కలెక్షన్లను రాబడుతుంది అనడంలో సందేహం లేదు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -