Jr NTR: ఆ ప్రొడ్యూసర్ కొడుకు దగ్గర వాచ్ లో టైం కోసం పది డాలర్లు తీసుకున్న ఎన్టీఆర్!

Jr NTR:  తెలుగు ప్రేక్షకులకు జూనియర్ ఎన్టీఆర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి నటుడుగా తనకంటూ చెరగని ముద్ర సంపాదించుకున్నాడు. ఇక ఎన్టీఆర్ అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. అలా వరుస సినిమా ఆఫర్లు అందుకుంటూ ఎన్టీఆర్ స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు.

ఇక నటన విషయంలో తాతకు తగ్గ మనవడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇటీవల రాజమౌళి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని పాన్ ఇండియా స్టార్ గా హడావిడి చేస్తున్నాడు. ఇదిలా ఉంటే బెల్లంకొండ సురేష్ వారసుడు గణేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్టీఆర్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటపెట్టాడు.

గణేష్ కి సెలవులు సమయంలో ఆస్ట్రేలియా షెడ్యూల్ ఉంది. ఆ సమయంలో గణేష్ కి వాచ్ లో టైం చూడడం రాలేదట. దానికి ఎన్టీఆర్ సహాయం అడగగా జస్ట్ ఇలా చూడాలని చెప్పాడట. అలా చెప్పినందుకే మా అన్నయ్య దగ్గర నా దగ్గర ఎన్టీఆర్ పది డాలర్లు వసూలు చేశాడని గణేష్ ఫన్నీగా నవ్వుకుంటూ తెలిపాడు. గణేష్ ప్రస్తుతం ఎన్టీఆర్ గురించి ఫన్నీగా బయటపెట్టిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం ఎన్టీఆర్ రాబోయే సినిమాల విషయానికొస్తే.. ఎన్టీఆర్ 30 అనే ప్రాజెక్టుతో త్వరలో ప్రేక్షకులు ముందుకు వస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ సినిమాకు డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. అదేవిధంగా ఎన్టీఆర్ 31 అనే ప్రాజెక్టు కూడా త్వరలో థియేటర్లో హడావిడి చేయబోతుంది. ఇక ఈ సినిమాకు కే జి ఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. మరి ఈ రెండు ప్రాజెక్టులతో ఎన్టీఆర్ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -