Jr NTR: ఇంటి పనిమనిషి కూతురి పెళ్లికి ఎన్టీఆర్ ఎన్ని లక్షల సహాయం చేసాడో తెలుసా?

Jr NTR: టాలీవుడ్ ప్రేక్షకులకు ఎన్టీఆర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి నటనలో తాతకు తగ్గ మనవడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. ఇటీవల విడుదలైన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.

ఈ నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో సినీ అవకాశాలు అందుకుంటూ వరల్డ్ వైడ్ గా ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్. ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ ఇంట్లో పని చేసే పని మనిషికి, వాళ్ల కూతురు పెళ్లి కోసం ఎన్టీఆర్ చేసిన సహాయం తెలిస్తే నిజంగా అందరూ ఫిదా అవుతారు. తన పనిమనిషి పెళ్లి బాధ్యత అంతా ఎన్టీఆర్ స్వయంగా చూసుకున్నాడు అట. అంతేకాకుండా 20 లక్షల రూపాయల అదనంగా ఇచ్చాడట తారక్. ఎందుకంటే ఆ పనిమనిషి ఇంట్లో 20 సంవత్సరాలుగా ఎంతో నమ్మకంగా పని చేస్తుందట.

అందుకనే పనిమనిషి అంటే ఇంట్లో అందరికి అభిమానం. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ పనిమనిషి చెబుతుంది. నిజంగా తారక్ వాళ్ళ ఇంట్లో పనిచేయడం జన్మజన్మల పుణ్యమని అంటుంది. చాలామంది ఇళ్లల్లో పని వాళ్ళను పని మనిషిలాగే చూస్తారు అని, కానీ ఎన్టీఆర్ మమ్మల్ని పిన్ని బాబాయ్ అనే బంధంతో పలకరిస్తాడు అని ఆ పనిమనిషి తెలిపింది. ప్రస్తుతం ఆ పనిమనిషికి ఎన్టీఆర్ చేసిన సహాయానికి ఆ పనిమనిషి ఎంతో ఆనందంగా ఫీల్ అవుతుంది.

ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన మంచితనానికి కామెంట్ల రూపంలో అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ రాబోయే సినిమాల విషయానికొస్తే ఎన్టీఆర్ 30 అనే ప్రాజెక్టుకు డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం ఇస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ 31 అనే ప్రాజెక్టుకూ కే జి ఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ రెండు ప్రాజెక్టులతో ఎన్టీఆర్ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -