Jr NTR: మెగా ఫ్యామిలీ కోసం తారక్ అలాంటి సాయం చేస్తున్నారా?

Jr NTR: ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలు ఎక్కువగా మెగా కుటుంబం నుంచి నందమూరి కుటుంబం నుంచి వస్తున్నారు. మెగా హీరోల కు జూనియర్ ఎన్టీఆర్ మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ ఈ మధ్యనే రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ మూవీ లో నటించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ మూవీతో వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన స్ట్రాంగ్ బాండింగ్ వల్ల ఇటు ప్రైవేట్ గానే కాకుండా అటు ఫ్యామిలీస్ మధ్య కూడా మంచి రిలేషన్ ఏర్పడిందని ఇండస్ట్రీలో టాక్. ఈ నేపథ్యంలో సాయిధరమ్ తేజకు జూనియర్ ఎన్టీఆర్ భారీ సాయం చేయబోతున్నాడు అన్న పుకారు వైరల్ గా మారింది.

ఆర్ఆర్ఆర్ మూవీ తో ఎన్టీఆర్ కు పాన్ ఇండియా రేంజ్ లో ఫాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ అంటే ఉన్న క్రేజ్ విపరీతంగా పెరిగింది. అందరికీ సాయం చేసే అలవాటు ఉన్నా ఎన్టీఆర్ ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ కూడా సాయం చేయబోతున్నారట.

 

సాయి ధరమ్‌ తేజ్ లాస్ట్ మూవీ రిపబ్లిక్‌ ఊహించిన ఫలితాలు సాధించ లేక పోయింది. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి ధరమ్‌ తేజ్ మూవీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ కోసం సాయి ధరమ్ బాగా కష్టపడుతున్నాడని సమాచారం.

ప్రస్తుతం ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ దర్శక బృందం అప్రోచ్ అయినట్టు సమాచారం. ఈ మూవీకి సంబంధించిన టీజర్ లాంచ్ చేయమని ఎన్టీఆర్ను కోరగా అతను ఓకే చెప్పాడు. ఈ డిసెంబర్ 7న మూవీ టైటిల్ తో పాటు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని కూడా లాంచ్ చేయబోతున్నారు. ఎన్టీఆర్ లాంచ్ చేస్తున్న మూవీ కాబట్టి దీని మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందో వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -