Jr NTR – Amit Shah: అమిత్ షాతో భేటీ.. రాజకీయాల్లోకి ఎన్టీఆర్ ఎంట్రీ?

Jr NTR – Amit Shah: ప్రస్తుతం తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నేడు మంత్రి అమిత్ షా టూర్ పై బిగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ప్రకారం అమిత్ షా హైదరాబాద్ లో పర్యటిస్తున్న నేపథ్యంలో ఈయన నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో భేటీ కానున్నట్లు సమాచారం.

ఈ సందర్భంగా ఆమె షా 15 నిమిషాల పాటు అమిత్ షా తో బేటి అయి లంచ్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విధంగా అమిత్ షా నటుడు ఎన్టీఆర్ కి అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా లంచ్ కి ఆహ్వానించడంతో ఈ భేటీ పై సర్వత్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి.గత కొంతకాలం నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున రాజకీయాలలోకి రావాలని పెద్ద ఎత్తున అభిమానులు కోరుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఏ వేదికపై కనిపించిన పెద్ద ఎత్తున అభిమానులు సీఎం అంటూ కేకలు వేయడం మనం చూస్తున్నాము.

ఈ క్రమంలోనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఎన్టీఆర్ భేటీ కావడంతో ప్రతి ఒక్కరూ వీరి భేటీ కావడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి ఎన్టీఆర్ ను రాజకీయాలలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే అమిత్ షా ఎన్టీఆర్ తో భేటీ కానున్నారా అనే విషయం పై సందేహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీం పాత్రలో ఎంతో ఒదిగిపోయి నటించారంటూ గతంలో అమిత్ షా ఆయనపై ప్రశంసలు కురిపించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ విషయంపై తనని కలవడానికి అపాయింట్మెంట్ ఇచ్చారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా అమిత్ షా ఎన్టీఆర్ భేటీ కావడం అందరిలోనూ తీవ్ర ఉత్కంఠత లేపుతోంది.

Related Articles

ట్రేండింగ్

Raghurama Krishnam Raju: రఘురామ కృష్ణంరాజు కల నెరవేరిందిగా.. ఉండి ఎమ్మెల్యేగా ఆయన విజయం పక్కా!

Raghurama Krishnam Raju: ప్రస్తుత నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలుపొందారు. ఇలా గెలిచిన కొద్ది రోజులకే పార్టీ పిఠాయించి తెలుగుదేశం చెంతకు చేరారు....
- Advertisement -
- Advertisement -