Jr NTR Mother: తారక్ తల్లి గురించి నాడు అలాంటి వార్తలొచ్చాయా?.. అసలు ఏమైందంటే?

Jr NTR Mother: సీనియర్ ఎన్టీఆర్ పోలికలతో జన్మించి, నందమూరి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు. సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి అనేక హిట్ చిత్రాలు ప్రేక్షకులకు అందించారు. సీనియర్ ఎన్టీఆర్ మాదిరే నటనలో మంచి మార్కులు కొట్టేశారు జూ. ఎన్టీఆర్. గంభీరమైన ఆహార్యం, అదిరిపోయే స్టెప్పులు వేయడం జూనియర్ ఎన్టీఆర్ స్పెషాలిటీ. సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో కాస్త లావుగా కనిపించారు. ఆ తర్వాత కుదుటపడ్డారు. స్టార్టింగ్ చిత్రాలు నిన్ను చూడాలని, రాఖీ సినిమాల్లో లావుగా కనిపించిన ఎన్టీఆర్.. యమదొంగ, కంత్రీ సినిమాల టైమ్ కి సన్నబడ్డాడు.

షాలిని సంగీత అధ్యాపకురాలిగా పని చేసేవారు. ఎన్టీఆర్ కుటుంబంలోని పిల్లలకు సంగీత పాఠాలు చెప్పేవారు. హరికృష్ణ ఎక్కువగా ఇంట్లోనే ఉంటూ తండ్రి ఎన్టీఆర్ కు సాయపడేవాడు. షాలినిని స్వయంగా కారులో హరికృష్ణ ఇంటి వద్ద దింపి వచ్చేవారు. ఈ నేపథ్యంలో షాలినిపై మనసు పడ్డాడు హరికృష్ణ. అనతరం షాలినిని రెండో పెళ్లి చేసుకున్నారు హరికృష్ణ.

హరికృష్ణ కూడా సినిమాల్లో, రాజకీయాల్లో ఫేమస్ అయ్యారు. తండ్రి అంటే తారక్ కు చాలా ఇష్టం. జూ. ఎన్టీఆర్ హరికృష్ణ రెండో భార్య కుమారుడుగా అందరికీ తెలిసిందే. హరికృష్ణ రెండో భార్య షాలిని కర్ణాటక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. అయితే తారక్ తల్లి మరో మతానికి చెందిన వారు అంటూ అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. అయితే, అది వాస్తవం కాదు.

షాలినికి మొదటి సంతానంగా తారక్..


హరికృష్ణ షాలినిని రెండో వివాహం చేసుకున్నాక జూనియర్ ఎన్టీఆర్ జన్మించారు. సీనియర్ ఎన్టీఆర్ పోలికలతో జన్మించడంతో ఆయన పేరునే తారక్ కు పెట్టారు. సీనియర్ ఎన్టీఆర్ స్వయంగా పిలిపించి ఈ పేరును పెట్టారట. అయితే, అటు తర్వాత నందమూరి ఫ్యామిలీ అంతా షాలినిని, జూనియర్ ఎన్టీఆర్ ను దూరం పెట్టారనే ప్రచారం జరిగింది. తారక్ సినీరంగ ప్రవేశం చేశాడు. అనేక హిట్ చిత్రాల్లో నటించాడు. తనను తాను ప్రూవ్ చేసుకున్నాక నందమూరి ఫ్యామిలీలో కలుపుకున్నారట.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -