Jr.NTR: ఒకేసారి మూడు సినిమాలు.. ఇతర హీరోల ఫ్యాన్స్ కు భారీ షాక్!

Jr.NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి తారక రామారావు మనవడిగా సినీ ఇండస్ట్రీలోకి ఆయన అడుగుపెట్టారు. అప్పట్లో తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నారు. బాలరామాయణంలో రాముడిగా తారక్ కనిపించి తాతను దించేశాడు. నందమూరి కాంపౌండ్ నుంచి ప్రస్తుతం మూడో తరం హీరోల్లో తారక్ టాప్ హీరోగా కొనసాగుతున్నాడు.

 

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా గురించి చర్చించుకుంటే తారక్ గురించి అందరూ ఎక్కువగా మాట్లాడుకున్నారు. ఈ సినిమాలో గోండు జాతి వీరుడిగా తారక్ కనిపించాడు. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ ఒదిగిపోయాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీముడో అంటూ సాగే పాటలో తారక్ నటన అద్భుతమనే చెప్పాలి. అందుకే అంతర్జాతీయంగా తారక్ నటనకు అందరూ ఫిదా అయిపోయారు.

 

ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తారక్ ఏ సినిమా చేయనున్నాడో ప్రకటించాడు. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30వ సినిమాను రూపొందించనున్నారు. ఈ సినిమా గురించి అప్ డేట్ అయితే ఇంత వరకూ రాలేదు. షూటింగ్ కూడా ఎప్పటి నుంచి మొదలవుతుందో ఇంకా తెలియలేదు. దీంతో తారక్ ఫ్యాన్స్ బాధపడుతున్నారు.

 

చాలామంది జూనియర్ ఎన్టీఆర్ వేగంగా షూటింగ్ లో పాల్గొనడం లేదని ఫీలవుతున్నారు. ముఖ్యంగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే తారక్ ఒకే టైంలో మూడు సినిమాల షూటింగ్ లో తారక్ పాల్గొననున్నారని, తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలని తారక్ చూస్తున్నట్లు ఫ్యాన్స్ తెలుపుతున్నారు. త్వరలో తారక్32 ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రకటన కూడా అధికారికంగా రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తారక్ విదేశీ ఫ్యామిలీ టూర్ లో ఉన్నారు. త్వరలోనే ఆయన ఇండియాకు రానున్నారు. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీ కానున్నట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -