Jr NTR: ఎన్టీఆర్ వాచ్ అమ్మితే బ్యాచ్ సెటిలైపోవచ్చా.. వాచ్ ఖరీదెంతంటే?

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగడమే కాకుండా ఈయన వ్యక్తిగత జీవితంలో కూడా అంతే రాయల్ గా జీవించడానికి ఇష్టపడతారు అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఎంతో ఖరీదైన వస్తువులను ఉపయోగించడానికి ఏమాత్రం వెనకాడరు. ముఖ్యంగా ఎన్టీఆర్ వాచ్ ప్రేమికుడు.ఈయనకు వాచ్ అంటే ఎంతో ఇష్టం ఉండటంతో కోట్ల రూపాయల ఖర్చు చేసి ఖరీదైన వాచ్ లను కొనుగోలు చేస్తూ ఉంటారు.

ఇప్పటికే ఎన్నో రకాల ఖరీదైన వాచ్ లను కలెక్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఎన్టీఆర్ కొనుగోలు చేసే వాచ్ లన్నీ కూడా దాదాపు కోట్ల రూపాయల విలువ చేస్తుంటాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా జపాన్ పర్యటనలో ఉన్న విషయం మనకు తెలిసింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ధరించిన వాచ్ గురించి ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ఎన్టీఆర్ ఈ ప్రమోషన్లలో చేతికి ధరించిన వాచ్ ధర ఎంత ఉంటుంది అంటూ అభిమానులు ఆరాతీస్తున్నారు. అయితే ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో ఎన్టీఆర్ ధరించిన వాచ్ రిచర్డ్ మిల్లెకు చెందినది. ఈ వాచ్ సుమారు రెండు కోట్ల రూపాయల వరకు విలువ చేస్తుంది. అయితే ఇండియాలో కూడా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తారక్ ఇదే వాచ్ ని ధరించారు. అయితే ఈయన ధరించిన ఈ వాచ్ ధర ఏకంగా రెండు కోట్లు అంటే ప్రతి ఒక్కరు ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు.

ఎన్టీఆర్ ఈ వాచ్ అమ్మితే ఒక బ్యాచ్ మొత్తం సెటిల్ అయిపోవచ్చు అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఏది ఏమైనా తారక్ రాయల్ లైఫ్ అంటే ఎంతో ఇష్టపడతారని దీన్ని బట్టి తెలుస్తోంది. తారక్ కేవలం వాచ్లు మాత్రమే కాకుండా ఈయన కార్ల నుంచి మొదలుకొని షూస్, టీషర్ట్స్ వంటివి కూడా ఖరీదైన బ్రాండ్ కు సంబంధించినవే ఉపయోగిస్తారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -