Jr NTR: మరో భాషలో మాట్లాడి అబ్బురపరిచిన జూనియర్ ఎన్టీఆర్

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నందమూరి తారక రామారావు తర్వాత ప్రేక్షకాభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ను అంతలా ఆరాధిస్తారు. జూనియర్ ఎన్టీఆర్ నటుడిగా ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజులకే టీడీపీ తరపున ప్రచారాల్లో పాల్గొన్నారు. తన మాటతో అభిమానుల మనసును దోచుకున్నారు. దీంతో సీనియర్ ఎన్టీఆర్, నారా చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీని నడిపించే సత్తా ఉన్న వ్యక్తిగా ఎన్టీఆర్ నిలిచారు.

 

పార్టీ ప్రచార సభల్లో తనదైన శైలితో మాట్లాడుతూ అందర్నీ ఎన్టీఆర్ ఆకట్టుకున్నాడు. తారక్ కెరీర్ ఆరంభంలోనే తానొక గొప్ప లీడర్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాతో తనలో దాగిన అన్నిరకాల ప్రతిభల్ని అందరికీ చూపుతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాకి మలయాళం మినహా అన్ని భాషల్లోనూ టైగర్ సొంతంగా డబ్బింగ్ చెప్పడం విశేషం.

 

తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్ రిలీజ్ సందర్భంగా ఏకంగా జపనీస్ భాషలోనే తారక్ స్పీచ్ ఇచ్చి అందర్నీ ఆకట్టుకున్నాడు. దీంతో తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటుగా జపనీస్ కూడా తెలుసులే అని అందరూ అనుకుంటున్నారు. తారక్ లో అంతకు మించిన భాషా నైపుణ్యం దాగి ఉందని మరోసారి లాస్ ఎంజిల్స్ వేదికగా నిరూపితమైందని చెప్పొచ్చు. ఆర్ఆర్ఆర్ సినిమా ఇటీవల లాస్ ఏంజెల్స్ లోని డీజీఏ థియేటర్లో స్క్రీనింగ్ అయ్యింది.

 

ఈ షోకి ఎన్టీఆర్, రాజమౌళి హాజరయ్యి వేదికపై అమెరికన్ యాసలో ప్రసంగించారు. ఇదే వేకదిపై తారక్ అమెరికన్ యాసతో మాట్లాడ్డం అందర్నీ ఆకట్టుకుంది. అమెరికన్ వెస్టర్న్ ప్రజల్ని తన భాషతో సర్ ప్రైజ్ చేసిన తారక్ ను చూసి అక్కడి వారంతా ఆనందం వ్యక్తం చేశారు. ఓ తెలుగు నటుడు, భారతీయుడు అమెరికన్ లాంగ్వేజ్ ని ఇరగదీస్తున్నాడంటూ నిరూపించాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -