NTR: రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ.. ఏమైందంటే?

NTR: టాలీవుడ్ లోని మోస్ట్ ట్యాలెంటెడ్ నటుల జాబితాలో యంగ్ టైగర్ తారక్ టాప్ లో ఉంటాడు. నందమూరి నట వారసత్వాన్ని మూడో తరంలో కొనసాగిస్తున్న ఈ నటుడు.. యాక్టింగ్, డ్యాన్స్, కామెడీతో అన్ని రకాలుగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’తో ప్యాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. అందులో నటనకు ఏకంగా ఆస్కార్ బరిలో నిలవడం తెలుగు వాళ్లందరికీ ఎంతో గర్వకారణం.

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కేవలం సినిమా నేపథ్యం మాత్రమే లేదు, అతడికి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ఉంది. తారక్ తాత తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ‘తెలుగుదేశం’ పార్టీని స్థాపించాడు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ కాస్త ఇబ్బందికరంగా ఉందనే చెప్పుకోవాలి. పార్టీని నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు వయసుతో ఇబ్బందిపడుతుండగా.. అతడి కొడుకు నారా లోకేష్ నాయకత్వాన్ని నిరూపించుకోలేకపోతున్నారు.

 

దీంతో చాలాకాలంగా తెలుగుదేశం పార్టీ పగ్గాలను ఎన్టీఆర్ చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది. గతంలో తారక్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయగా.. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి, అధికారాన్ని దక్కించుకుంది. ఈ నేపథ్యంలో మరోసారి ఎన్టీఆర్ రాజకీయ బరిలో నిలవాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే తాజాగా ఎన్టీఆర్ రాజకీయ ప్రచారానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్ అవుతోంది.

 

తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం కోసం ఎన్టీఆర్ మరోసారి రాజకీయ ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ముహూర్తం కూడా ఖరారైనట్లు సమాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ రాబోయే అక్టోబర్ 1వ తేదీ నుండి ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. చాలాకాలంగా ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ గురించి వార్తలు రాగా.. తాజాగా ఎప్పటి నుండి ఎన్టీఆర్ ప్రచారం చేస్తారనే తేదీ కూడా ఖరారు కావడంతో రాజకీయంగా చర్చకు దారితీసింది.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -