Jr NTR: రాజకీయ దుమారంలోకి జూనియర్ ఎన్టీఆర్… జగన్ ముందే ఊహించలేదా?

Jr NTR: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2009 ఎన్నికల్లో తన తాత యుగపురుషుడు నందమూరి తారకరామారావు స్ధాపించిన టీడీపీ పార్టీకి మద్దతు తెలిపారు. టీడీపీ తరపున స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించారు. ఎన్నికలకు ముందు తెలుగు రాష్ట్రవ్యాప్తంగా తిరిగి చంద్రబాబు సీఎం కావాలని జోరుగా ప్రచారం నిర్వహించారు. తన వాగ్దాటితో, డైలాగ్ లతో ప్రజలను ఆకట్టుకున్నారు. చివరికి రోడ్డు ప్రమాదం జరిగి హాస్పిటల్ బెడ్డుపై ఉండి కూడా చంద్రబాబు సీఎం కావాలని ప్రచారం చేశారు. అయినా ఆ ఎన్నికల్లో టీడీపీ గెలవలేదు. అయినా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పుడు సీఎం అయ్యారు.

ఆ తర్వాత ఎన్టీఆర్ ను చంద్రబాబు దూరం పెట్టారు. పార్టీలో తన కుమారుడు నారా లోకేష్ కు పోటీగా ఉండకూడదనే ఎన్టీఆర్ ను చంద్రబాబు దూరం పెట్టాడనే ప్రచారం ఇప్పటికీ ఉండదు. జూనియర్ ఎన్టీఆర్ కు భారీ ఫాలోయింగ్ ఉంది. మంచి వాగ్దాటితో పాటు బాగా క్రేజ్ ఉంది. దీంతో ఎన్టీఆర్ టీడీపీలో ఉంటే తన కొడుకు లోకేష్ కు పార్టీలో పోటీ అవుతాడు. నారా లోకేష్ ను అప్పుడు ఎవరూ పట్టించుకోరు. అందేకే కొడుకుకు పోటీ కాకుండా టీడీపీ నుంచి ఎన్టీఆర్ ను చంద్రబాబు దూరం పెట్టాలనే ప్రచారం ఇప్పటికీ ఉంది. అందుకే ఇప్పుడు కష్టకాలంలో ఉన్న టీడీపీని ఎన్టీఆర్ పట్టించుకోవడం లేదనే టాక్ ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత ప్రాణ స్నేహితుడైన కొడాలి నాని, మంచి ఫ్రెండ్ అయి వల్లభనేని వంశీ పార్టీకి దూరం కావడానికి కారణం కూడా జూనియర్ ఎన్టీఆర్ అనే ప్రచారం ఉంది. కొడాలి నాని టీడీపీని వీడి వైసీపీలో చేరడం వెనుక కూడా జూనియర్ ఎన్టీఆర్ హస్తం ఉందనే ప్రచారం జరిగింది. కానీ కొడాలి నాని పార్టీ మారడటంతో తన ప్రమేయం ఏమీ లేదని, అది ఆయన సొంత నిర్ణయమని అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు. కానీ ఇప్పటికీ జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కొడాలి నాని నిర్మాతగా ఎన్టీఆర్ తో పలు సినిమాలు చేశారు.

కానీ ఎన్టీఆర్ టీడీపీకి దూరం అయిన తర్వాత పార్టీ విషయాల్లో అసలు జోక్యం చేసుకోవడం లేదు. పూర్తిగా సినిమాల్లో బిజీగా ఉన్నారు. వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. వరుస హిట్ సినిమాలతో ఎన్టీఆర్ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరింది. దీంతో రాజకీయాల గురించే జూనియర్ ఎన్టీఆర్ పట్టించుకోడం లేదు. పార్టీలకతీతంగా జూనియర్ ఎన్టీఆర్ కు అన్ని పార్టీల్లో అభిమానులు ఉన్నారు. ఒకవేళ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపడితే ఇతర పార్టీల్లోని అభిమానులు కూడా ఎన్టీఆర్ సపోర్ట్ చేస ే అవకాశం ఉంటుంది.

అయితే ఎట్టకేలకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. జగన్ తీసుకునన నిర్ణయాన్ని ట్విట్టర్ వేదికగా ఖండించారు. ఎప్పటినుంచో ఉన్న పేరును ఇప్పుడు మార్చడం సరికాదని విమర్శలు చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యనివర్సిటీ పేరుగా మార్చడంపై ఏపీలో రాజకీయ దుమారం రేరుగుతోుంది. టీడీపీతో పాటు జనసేన, బీజేపీ పార్టీలు కూడా జగన్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాజకీయంగా ఇది వైసీపీ, టీడీపీ మధ్య పెద్ద దుమారం రేగుతోంది. ఇలాంటి తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించడంతో.. రాజకీయ రోచ్చులోకి జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చినట్లు అయింది.

ఇక హీరో కల్యాణ్ రామ్ కూడా జగన్ సర్కార్ నిర్ణయంపై స్పందించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు తనను బాధించిందని ఆయన తెలిపారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న పేరును రాజకీయాల కారణంగా మార్చడం సరికాదని కల్యాణ్ రామ్ తన అధికారిక ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ పెట్టారు. ఇక వైఎస్సార్ కుటుంబం నుంచి కూడా జగన్ నిర్ణయంపై వ్యతిరేకత మొదలుకాడం విశేషం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొంత కూతురు, జగన్ సొంత చెల్లి వైఎస్ షర్మిల కూడా జగన్ నిర్ణయాన్న వ్యతిరేకించడం ఆశ్చర్యకరంగా మారింది.

Related Articles

ట్రేండింగ్

Namrata Shirodkar: రోజురోజుకూ మహేష్ భార్య చిన్నపిల్లవుతోంది.. 50 ఏళ్ల వయస్సులో ఇదేం అందమంటూ?

Namrata Shirodkar:  మనకు వయసు పైబడే కొద్ది మన అందం కూడా తగ్గుతుందని చెప్పాలి. ఇలా వయసు పైబడిన కొద్ది అందం కాపాడటం కోసం సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కష్టపడుతూ ఉంటారు కానీ...
- Advertisement -
- Advertisement -