Junior NTR: జూనియర్ ఎన్టీఆర్ మార్ఫింగ్ ఫోటోలు ప్రచారం చేసిన టీవీ9.. ఏమైందంటే?

Junior NTR: కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండా జరిగే కొన్ని చిన్న పొరపాట్లు కూడా పెద్ద ఎత్తున వివాదంగా మారుతూ ఉంటాయి. అయితే ఇలాంటి పొరపాట్లు కనక స్టార్ హీరోల మధ్య గనుక తలెత్తితే అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండదని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఇలాంటి పొరపాటు ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ విషయంలో చోటు చేసుకోవడంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ఇంతకీ ఏం జరిగింది అనే విషయానికి వస్తే… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలు వారి పొలిటికల్ కెరీర్ మీద ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఒక ఐటెం న్యూస్ ప్రసారం చేశారు. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ ఫోటోలో ఎన్టీఆర్ ను మార్ఫింగ్ చేసి ఉంది.అయితే ఇది గమనించకుండా అలాగే ప్రసారం చేయడంతో ఇది కాస్త సెన్సేషనల్ గా మారింది.

 

దీంతో ఎన్టీఆర్ అభిమానులు తమ హీరోకి అవమానం జరిగింది అంటూ తీవ్ర స్థాయిలో మండి పడటమే కాకుండా సదురు న్యూస్ ఛానల్ ను బాయికాట్ చేయాలి అంటే డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ ను ఇలా అవమానించినందుకు సదరు న్యూస్ ఛానల్ క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.ప్రస్తుత ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

 

ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే…ప్రస్తుత కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నటువంటి దేవర సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. అదేవిధంగా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్నటువంటి వార్ 2 సినిమాలో కూడా ఈయన కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -