NTR: ధమ్కీ ఇవ్వబోతున్న జూనియర్ ఎన్టీఆర్.. అలా ప్లాన్ చేస్తున్నారా?

NTR: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. విశ్వక్ సేన్ సినిమాల ద్వారా కంటే కాంట్రవర్సీల ద్వారానే ఎక్కువగా హైలైట్ అయ్యాడని చెప్పవచ్చు. ఇకపోతే విశ్వక్ సేన్ చివరిగా ఓరి దేవుడా సినిమాలో నటించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం దాస్ కా ధమ్కీ. ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్ నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాకు విశ్వక్ సేన్ దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా కూడా నటించాడు. అంటే దర్శకుడు హీరో ఒక్కరే అన్నమాట. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాకి గాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రాబోతున్నట్టు మొన్నటి వరకు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వార్తను అధికారికంగా ప్రకటించారు. ఆ వార్తలు నిజం అయ్యాయి. ఈనెల 17వ తేదీన మూవీ మేకర్స్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొనబోతున్నారు.

 

కాగా విశ్వక్ సేన్ ఎన్టీఆర్ కి హార్డ్ కోర్ ఫ్యాన్ అన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని గతంలో పలుసార్లు తెలిపారు విశ్వక్ సేన్. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో గ్లోబల్ స్టార్ అయినా జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అయిన విశ్వక్ సేన్ కోసం రావడం అన్నది చాలా సంతోషంగా ఉంది అని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా విశ్వక్ అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Roja: నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిలా మారిన రోజా.. శత్రువులే తప్ప మిత్రులు లేరా?

Roja:  నగరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి రోజా ప్రస్తుతం నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిగా మారిపోయారు. ఈమె 2014 ఎన్నికలలో వైసిపి నుంచి గెలుపొందారు. అలాగే 2019 సంవత్సరంలో కూడా 2...
- Advertisement -
- Advertisement -