NTR: హామీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. వాళ్ల ముగ్గురి గెలుపు ఖాయమేనా?

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి ఎన్నికల కదనరంగంలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గ బలమైన సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పలు కార్యక్రమాలు చకచక నడుస్తున్నాయి. కొరటాల శివతో చేస్తున్న సినిమా పూర్తైన వెంటనే రాజకీయ ప్రచారం జూనియర్ షూరు చేస్తారనే టాక్ నడుస్తోంది.ఫ్యాన్సు కూడా
ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులను గెలిపించుకునే బాధ్యతను తానే తీసుకుంటున్నట్లు జూనియర్ ప్రకటించినట్లు బాగా ప్రచారం ఉంది.

 

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. తెలంగాణలో పార్టీ పూర్తిగా సుప్తావస్తకు చేరుకోగా, ఏపీలో ఉనికి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే చంద్రబాబు కొడుకు నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో ఆయన ఓడిపోయారు. కానీ వెనక్కి తగ్గమని టీడీపీ నేతలు చెబుతున్నారు. లోకేశ్ కూడా ఆ ఓటమిని గుణపాఠంగా తీసుకున్నారు.

ఇక పార్టీకోసం తన వంతుగా సాయం చేయాలని యంగ్ టైగర్ ఎన్టీఆర్ భావిస్తారు. ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలు చకచక పూర్తి చేసి, ప్రచారానికి దిగాలని చూస్తున్నారు. అన్న తారకరత్న కలలు కన్న రాజకీయ ఆకాంక్షని భార్య అలేఖ్య రెడ్డితో పూరించాలని భావిస్తున్నారు. ఇందుకోసం స్వయంగా ప్రచారానికి జూనియర్ వస్తారని తెలిసింది. దీంతోపాటు, చంద్రబాబుని ఓడిస్తామని చెబుతున్నా వైసీపీకి చుక్కలు చూపించి, కుప్పంలోనూ ఆయన ప్రచారం చేస్తారని టీడీపీ నేతలు అంటున్నారు. ఇక యువనేత లోకేశ్ గెలుపు కోసం కూడా పాటు పడుతానని తారక్ చెప్పినట్లు టాక్ నడుస్తోంది. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక టీడీపీకి తిరుగులేదంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -