NTR: జగన్ కు గట్టి పోటీ ఇవ్వనున్న జూనియర్ ఎన్టీఆర్.. ప్లాన్ ఇదే!

NTR: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక హీరోగా ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడో వ్యక్తిగతంగా కూడా అంతే మంచి పేరు సంపాదించుకున్నాడు. మొత్తానికి తాతకు తగ్గ మనవడు అని నిరూపించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ ని రాజకీయ నాయకుడిగా ఏ రోజు చూడలేదు.

 

చాలామంది ఎన్టీఆర్ ని రాజకీయ నాయకుడిగా చూడాలి అని బాగా కలలు కంటున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఈ విషయం గురించి ఇప్పటివరకు స్పందించనే లేదు. అయితే ఇప్పుడు రానున్న ఎన్నికల సందర్భంగా ఎన్టీఆర్ బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారాలు చేస్తున్నారు. ఎలాగైనా తమ పార్టీ గెలవాలి అనుకొని ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన విధంగా ప్రచారాలు చేసుకుంటూ పోతున్నారు.

అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈసారి గట్టి పోటీ కనిపిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాలన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా జగన్ ను ఓడించాలని ఒక వైపు తెలుగుదేశం పార్టీ, మరోవైపు జనసేన పార్టీ బాగా ప్రచారాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి జనసేన మద్దతు పలుకుతుందని కూడా వార్తలు జోరుగా వచ్చాయి.

 

అయితే ఇదంతా పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈసారి ఎన్టీఆర్ ను రంగంలోకి దింపాలని ప్రయత్నిస్తున్నాడు. మామూలుగా ఎన్టీఆర్ కు తెలుగు రాష్ట్రాల నుండి అభిమానం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక దానిని ఆసరాగా తీసుకొని చంద్రబాబు ఎన్టీఆర్ ను ప్రచారంలోకి దింపుతున్నట్టు తెలిసింది.

 

ప్రస్తుతం ఈ విషయం ఆంధ్ర ప్రదేశ్ లో బాగా హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా వైసీపీ నేతల గుండెల్లో దడ పుడుతుందని తెలుస్తుంది. అయితే తాజా విషయం ఏంటంటే.. ఎన్టీఆర్ త్వరలో జిల్లాల వారీగా నేతలను కలవబోతున్నారని దీనికి తోడు భారీగా వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఒకవేళ ఇదే నిజమైతే ఎన్టీఆర్, జగన్ మధ్య యుద్ధం ప్రారంభమైనట్లే అనిపిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -