Chandra Babu: టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హల్ చల్ చేశారు. బుధవారం పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ జెండాలను ప్రదర్శించి జై జూనియర్ ఎన్టీఆర్.. జై తారక్ అంటూ పెద్ద ఎత్తున నినాదులు చేశారు. తెలుగు రంగులో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ జెండాలను ప్రదర్శించారు. ఆ జెండాలపై జై జూనియర్ ఎన్టీఆర్ అని ఉంది.
చంద్రబాబు ప్రచార వాహణం మీద నిల్చోని ప్రజలకు అభివాదం చేస్తుండగా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ జెండాలను ప్రదర్శించి జై తారక్ అంటూ నినాదాలు చేయడం చంద్రబాబును షాక్ కు గురి చేసింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అనుకూలంగా నినాదాలు చేస్తున్న వారిని అక్కడ నుంచి టీడీపీ నేతల పంపించి వేశారు. చంద్రబాబు పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ కు అనుకూలంగా నినాదులు చేయడంతో మరోసారి ఏపీ రాజకీయ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తోన్నాయి. గతంలో చంద్రబాబు పర్యటనలో చాలాసార్లు ఎన్టీఆర ఫ్యాన్స్ ఇలాగే జెండాలను ప్రదర్శించి నినాదాలు చేశారు.
గతంలో చంద్రబాబు సభలో మాట్లాడుతుండగా జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. కానీ చంద్రబాబు మాత్రం వారిని అసలు పట్టించుకోకుండానే తన ప్రసంగాన్ని కంటిన్యూ చేశారు. ఇప్పుడు మరోసారి అలాగే చంద్రబాబు పర్యటనలో జూనియర్ ఫ్యాన్స్ హల్ చల్ చేయడంపై అనేక రకాలుగా చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ ను మళ్లీ టీడీపీలోకి తీసుకోవాలని, ప్రచారం చేయించాలనే డిమాండ్ టీడీపీలోని తారక్ ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిని చవి చూసిన తర్వాత ఈ డిమాండ్లు మరింత ఎక్కువయ్యాయి. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరితో పాటు పలువురు టీడీపీ నేతలు కూడా జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేస్తారని, మళ్లీ పార్టీలో యాక్టివ్ అవుతారంటూ రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి గతంలో చేసిన వ్యాఖ్యలు తెలుగు తమ్ముళ్లలో ఆసక్తికరగా మారాయి. ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలవడం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. అమిత్ షాను కలవడంపై టీడీపీ వర్గాలు ఎన్టీఆర్ పై భగ్గుమన్నాయి. సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నెగిటివ్ గా పోస్టులు పెడుతూ ట్రోల్స్ చేశారు.ఎన్టీఆర్ సినిమాలు చూడకుండా బ్యాన్ చేయలంటూ టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ ను వ్యతిరేకించే కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఇప్పుడు చంద్రబాబు పర్యటనలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ జెండాలు ఎగురవేస్తూ నినాదులు చేయడంతో చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది.దీనిపై అక్కడ ఉన్న కొంతమంది టీడీపీ నేతలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను అక్కడ నుంచి పంపించారు. చంద్రబాబు పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు చేయడం ఏంటని వారిపై సీరియస్ అయ్యారు. చంద్రబాబు పర్యటనలో ఊహించని ఈ పరిణామం అందరినీ షాక్ కు ురి చేస్తోంది.