NTR: వైరల్ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు!

NTR: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందునున్న సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 30వ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈనెల ఆఖరి నుండి మొదలుకానుంది. కాగా ఇప్పటికే ఈ సినిమా మొదలు కావాల్సి ఉండగా ఇప్పటికే చాలా ఆలస్యం అవ్వడంతో ఆ సినిమాకు సంబంధించిన ఉన్నారు మూవీ మేకర్స్. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలని భావిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

ఇకపోతే తారక్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ గుర్తింపు తెచ్చుకోవడంతో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కొరటాల శివ తారక్ క్రేజ్, అంచనాలను దృష్టిలో పెట్టుకొని సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 

ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ. నాకు పెద్ద లక్ష్యాలు అంటూ ఏమీ లేవు. చిన్నతనంలో స్కూలేంటి అనిపించేది. త్వరగా ఇంటికెళ్లిపోవాలి అనిపించేది. పదో తరగతి పాసైతే చాలు అనుకునేవాడిని. సినిమాలు కూడా ఒకటి చేస్తే చాలు అనుకునే వాడిని. రెండో సినిమా చేయాలని ఎప్పుడు అనుకోలేదు. కానీ 30 సినిమాలు చేసాను అంటే ఆశ్చర్యం కలుగుతోంది. అలా అని ఏదో చేయాలన్న ఆరాటం నాలో లేదు. నాకున్న దాంతో సంతోషంగా ఉండటమే జీవితం అనిపిస్తుంది.

 

ఆడపిల్లలు ఉన్న వాళ్లని చూస్తే ఈర్ష్య కలుగుతుంది. అమ్మాయి పుట్టాలని ఎంతో అనుకున్నాను. కానీ ఇద్దరు బాబులే. చాలా నిరాశ పడ్డాను. ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ కళే వేరు. కూతురు లేని లోటు ఎప్పటికీ ఉంటుంది. అని తెలిపారు ఎన్టీఆర్. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఆ మూవీ కోసం నేను చెర్రీ చాలా కష్ట పడ్డాము.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -