KA Paul: వైరల్ అవుతున్న కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు!

KA Paul: గతంలో జరిగిన ఎన్నికలలో భాగంగా ప్రజాశాంతి పేరిట ఎన్నికల బరిలోకి వచ్చిన కేఏ పాల్ తన మాటతీరుతో పెద్ద ఎత్తున అందరిని ఒక విధంగా సందడి చేశారనే చెప్పాలి. ఈయన కనుక రాజకీయాలలోకి రాకపోయి ఉంటే రాజకీయాలలో హాస్యం అనేది ఉండేది కాదేమో. విశాఖ ఒక ప్రైవేటీకరణ ఉద్యమంలో భాగంగా ధర్నా చేస్తూ మద్దతు తెలిపిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మీడియా సమావేశంలో ఈయన మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు.

గత ఎన్నికలలో భాగంగా మోడీని గద్దె దించడమే తన లక్ష్యం అంటూ చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున శపదాలు చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా కేఏ పాల్ సైతం చంద్రబాబు పాత్రను తాను పోషిస్తానని బిజెపి ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించడమే తన లక్ష్యం అంటూ వెల్లడించారు. ఈ సమావేశంలో ఈయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు ఇది తెలుగు ప్రజల హక్కు అని స్పష్టం చేశారు.

 

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపకపోతే వచ్చే ఎన్నికలలో బిజెపిని చిత్తుచిత్తుగా ఓడిస్తామని పాల్ వెల్లడించారు.2007 నుంచి 14 వరకు తాను బిజెపి ప్రభుత్వానికి మద్దతు తెలిపానని అయితే ఇప్పుడు ప్రైవేటీకరణను ఆపకపోతే ఆంధ్ర ప్రదేశ్ మొత్తం తిరిగి బిజెపిని ఓడించడానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రస్తుతం 15 కోట్ల మంది ప్రజలు ఒక్కొక్కరు పదిమందిని ప్రభావితం చేసి 150 కోట్ల మందికి చెప్పి బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించేలా చేస్తానని తెలిపారు.

 

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణం చేయటాన్ని అసలు సహించబోమని పాల్ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా 27 క‌మిటీలు ప‌ని చేస్తున్నాయ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు జ‌గ‌న్‌, కేసీఆర్ విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను కాపాడుకునేందుకు క‌లిసి పోరాడాల‌ని పాల్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పిలుపునిచ్చారు.

మోదీకి వ్య‌తిరేకంగా మాట్లాడ్డానికి భ‌య‌ప‌డుతున్న పాల‌క‌ప్ర‌తిప‌క్ష నేత‌ల్ని మ‌నం చూస్తున్నాం. ఇప్పుడు మోదీని ఓడించ‌డానికి తాను దేశ యాత్ర‌కు బ‌య‌ల్దేరుతున్నాన‌ని పాల్ చెప్ప‌డం గతంలో కూడా చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు ఆయన చేయడంతో పాల్ తనను గుర్తు చేస్తున్నారని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -