Kaikala:ఇండస్ట్రీలో మరో విషాదం.. తుదిశ్వాస విడిచిన కైకాల సత్యనారాయణ?

Kaikala: తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రముఖ సినీ నటుడు కైకాల సత్యనారాయణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు కైకాల సత్యనారాయణ. తన సినీ కెరియర్ లో దాదాపుగా 700కు పైగా సినిమాలు నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నారు. యమధర్మరాజు అంటే చాలు చాలామంది కైకాల సత్యనారాయణ గుర్తుకు వస్తూ ఉంటారు. ఆ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు.

 

కాగా మొదట సిపాయి కూతురు సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన సత్యనారాయణ ఆ తర్వాత సినీ కెరియర్ లో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా ఎన్నో సినిమాలలో నటించి నొప్పించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తాజాగా ఫిలింనగర్ లోని తన నివాసంలో తెల్లవారుజామున 4 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. రేపు జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో సత్యనారాయణ అంత్యక్రియలను నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

 

అయితే కైకాల సత్యనారాయణ మరణంతో ఒక్కసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అమ్ముకున్నాయి. ఆయన మరణంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అలాగే కుటుంబంలో విషాదం నెలకొంది. ఇక ఆయన మరణ వార్త తెలుసుకున్న చాలామంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు. కైకాల సత్యనారాయణ మరణం తెలుగు సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పవచ్చు.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -