Kajal Agarwal: కాజల్ కు వార్నింగ్ ఇచ్చిన భర్త.. ఏమైందంటే?

Kajal Agarwal: సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలలో కాజల్ అగర్వాల్ ఒకరు. 2007లో డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో టాలీవుడ్‌లో కాజల్ తెరంగేట్రం చేసింది. ఈ తర్వత 2009లో రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌ హీరోగా నటించిన చిత్రం ‘మగధీర’. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటించింది. మగధీర సినిమా రామ్‌చరణ్‌తోపాటు కాజల్‌కు కూడా బ్రేక్ వచ్చింది. దాంతో టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు పెరిగాయి. గణేష్, ఆర్య-2, బృందావనం, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, నా పేరు శివ, బిజినెస్ మెన్ వంటి సినిమాల్లో నటించింది. గోల్డెన్‌ లెగ్‌గా పేరు తెచ్చుకున్న కాజల్‌కు వరుసగా అవకాశాలు పెరిగాయి. స్టార్ హీరోలతో జతకట్టి.. తనదైన శైలిలో ఫ్యాన్ ఫాలొయింగ్, క్రేజ్‌ను పెంచుకుంది. తెలుగు, హిందీ, తమిళం వంటి భాషల్లోనూ నటించింది.

 

 

కాగా, కాజల్ అగర్వాల్ ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని ప్రేమించింది. కరోనా లాక్‌డౌన్ పీరియడ్‌లోనే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 2022 ఏప్రిల్ 19న ఈ జంటకు మగ బిడ్డ పుట్టాడు. అతడికి ‘నీల్ కిచ్లూ’ అని పేరు పెట్టారు. అయితే ప్రస్తుతం కాజల్ మళ్లీ సినిమాల్లో నటించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వరుసగా సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ పై గౌతమ్ కిచ్లూ కొన్ని కండీషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. సినిమాల్లో లిప్‌లాక్ సీన్లు, వల్గర్ రోల్స్ లో నటించొద్దని కిచ్లూ వార్నింగ్ ఇచ్చాడట. ఒకవేళ అలాంటి సీన్లల్లో నటించినట్లయితే ఊరుకోనని, విడాకులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటానని తేల్చి చెప్పారంట. కేవలం ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాల్లో మాత్రమే నటించాలని చెప్పాడట. కాజల్ అత్తా, మామలు కూడా ఇదే విషయాన్ని చెప్పడంతో.. చేసేదేమి లేక కాజల్ కూడా ఓకే చెప్పిందట. అయితే ఈ విషయంపై కాజల్ ఎలా రియాక్ట్ అవుతుందో.. ఎలాంటి సినిమా నటిస్తుందో వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -