Kajal Aggarwal: కొడుకును చూసి మురిసిపోతున్న కాజల్ అగర్వాల్!!

చందమామ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైనా కాజల్ అగర్వాల్‌ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాజల్‌ ఈ సంవత్సరం జూన్‌ 19న పండంటి మగ బిడ్డకు జన్మనించిన విషయం అందరికి తెలిసిందే. ఆమె తన కొడుకుకి నీల్‌ కిచ్లూ అని పేరు కూడా పెట్టారు. ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చిన కాజల్‌ అగర్వాల్‌ ప్రస్తుతం తన సమయమంతా కొడుకుతోనే గడుపుతుంది. ఆమె తల్లిగా తను పొందే ఆనందాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంది.

కాజల్ అగర్వాల్‌ కి కొడుకు పుట్టి ఆరు నెలలు అవుతున్న సందర్భంగా ఓ ఫోటోని సోషల్ మీడియాతో పంచుకుంది. ఆ ఫొటోలో చిన్నోడు నుదుటిపై చేతులు వేసుకొని చిరునవ్వులు చిందుస్తూ ముద్దుగా ఫోటోకి స్టిల్స్ ఇచ్చాడు. ఈ ఫోటోని షేర్‌ చేస్తూ కాజల్ ఈ విధంగా చెప్పుకొచ్చారు. నీల్‌ కిచ్లూ వచ్చాక తన జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో చెప్పుకొచ్చింది. ఇక ‘గత ఆరు నెలలు ఎలా గడిచిపోయాయో నాకు తెలియడం లేదంటూ పేర్కొంది.

అంతేకాదు.. యవ్వనంలో ఉన్నప్పుడు ఓ తల్లిగా నా కర్తవ్యాన్ని నెరవేరుస్తానా లేదా అన్న అనుమానం,భయం తనలో ఉండేదని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పటికి గొప్ప తల్లిని ఎలా అవ్వాలో నేర్చుకుంటూనే ఉన్నాని కాజల్ వెల్లడించింది. ఆమె ఎంత బిజీగా ఉనప్పటికీ.. నీ కోసం సమయం కేటాయిస్తానంటూ పేర్కొంది. కొడుకు పట్ల ఎప్పుడు అశ్రద్ధ చూపించని అన్నారు. కాగా.. రాత్రి సమయంలో నువ్వు అటూ ఇటూ దొర్లడం, నేలపై పాకడం చూసి సంతోష పడినట్లు పేర్కొంది. కొడుకు జీవితంలో తొలిసారి జరిగే ప్రతి మూమెంట్‌ ఇప్పటికి ఆమెకి గుర్తున్నాయ్ అని అన్నారు.

ఇక నీకు జన్మనిచ్చే అవకాశం ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంది. ఒక్క తల్లిగా చేసే బాధ్యతలు గొప్పవని అందరూ చెబుతుంటారు.. కానీ ఇప్పుడు ఇదంతా నాకు కొత్తే గానీ ఎంతో ఆనందంగా ఉన్నట్లు వెల్లడించింది. నువ్వు జన్మించి ఏడాది అవ్వడానికి ఇంకా సగం దూరం ఉన్నట్లు పేర్కొంది.’మై లవ్ మై బేబీ నీల్’ అంటూ కాజల్ ఎమోషనల్ గా రాసి అభిమానులతో షేర్ చేసుకుంది.

Related Articles

ట్రేండింగ్

Judges Trolling Case: జడ్జి హిమబిందుని అవమానించేలా పోస్టు పెట్టిన ‍వ్యక్తి అరెస్ట్‌.. ఆ వ్యక్తి ఎవరంటే?

Judges Trolling Case: చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అరెస్టు అయిన విషయం మనకు తెలిసిందే. నంద్యాలలో సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడుని అదుపులోకి...
- Advertisement -
- Advertisement -