Kajal Aggarwal: కాజల్ రిజెక్ట్ చేయడం వెనుక ఇంత కథ ఉందా?

Kajal Aggarwal: హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2004లో ఓ హిందీ సినిమాతో కెరీర్ ప్రారంభించిన కాజల్.. `లక్ష్మీ కళ్యాణం` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత `చందమామ` సినిమాతో మంచి గుర్తింపు పొందింది. టాలీవుడ్, కోలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుని అనతి కాలంలోనే స్టార్ హోదాను దక్కించుకుంది. స్టార్ హీరోలందరితోనూ నటించింది.

 

ఆ తర్వాత 2020లో ముంబైలో స్థిరపడ్డ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో ఏడడుగులు నడిచి వైవాహిక బంధం లోకి అడుగు పెట్టింది. పెళ్లి తర్వాత అడపా తడపా సినిమాలు చేసిన కాజల్.. గ‌త ఏడాది ప్రెగ్నెంట్ కావడంతో నటనకు బ్రేక్ ఇచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పనుందంటూ ప్రచారం జరిగింది. అయితే వాటన్నింటినీ కొట్టిపారేస్తూ ఆమె రీ ఎంట్రీకి సిద్ధమయ్యింది. తాజాగా ఇండియన్ 2 చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. కొన్ని రోజులుగా షూటింగ్‌లో కూడా పాల్గొంటోంది.

ఆ హీరోతో సినిమాకు నో..

తాజాగా కాజల్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్‌గా మారింది. టాలీవుడ్‌కు చెందిన ఓ సీనియర్ స్టార్ హీరో మూవీలో హీరోయిన్‌గా నటించమని కోరగా ఆమె తిరస్కరించిందట. గతంలోనే అదే హీరో చిత్రంలోనూ నటించడానికి ఆమె ఒప్పుకోలేదట. ఆ హీరో ఎవరని తెలియకపోయినప్పటికీ.. ఈ న్యూస్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

 

ఆమె ఆయనతో మూవీ చేయకపోవడానికి బలమైన కారణముందని తెలుస్తోంది. ఆ హీరో అమ్మాయిల పిచ్చోడని, లోబరుచుకుంటాడని ఓ టాక్ ఉందట. ఈ క్రమంలోనే తన ఫ్రెండ్ చెప్పిన మాటలు విన్న కాజల్ అగర్వాల్ ఆయనతో సినిమాలో నటించడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. అయితే టాలీవుడ్‌లో అలాంటి ఛీప్ మెంటాలిటీ ఉన్న హీరో ఎవరూ లేరని పలువురు అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -