Kalpika: అమ్మాయిల నిజస్వరూపం అదేనంటున్న కల్పికా గణేష్!

Kalpika: తెలుగు సినీ ఇండస్ట్రీలో 2009 నుండే ప్రయాణం ప్రారంభించినా.. మహేష్ – వెంకీ మల్టీ స్టారర్ మూవీ “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమాతో చాలా గుర్తింపు పొందింది కల్పికా గణేష్. ఆ తర్వాత టాలీవుడ్ లో చాలా సినిమాలే చేసారు. ఇక “సీతా ఆన్ రోడ్స్” వంటి మంచి సినిమాలో లీడ్ రోల్ పోషించిన కల్పిక ప్రేక్షకులను మెప్పించింది.

 

ఇక ఇటీవల విడుదలైన యశోద సినిమాలో మంచి రోల్ చేసింది. దీనితో మంచి గుర్తింపు వచ్చింది. హీరోయిన్స్ కంటే అందంగా ఉండడం, డామినేట్ చేస్తుందనే కారణాలతోనే తనను సినిమాల్లో కొంత దూరంగా ఉంచుతున్నారని ఈ అందాల భామ అభిప్రాయపడింది. తాను మొత్తం 30 సినిమాల్లో నటించగా కేవలం 15 మాత్రమే విడుదల అయ్యాయట. ప్రస్తుతం తాను చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

 

కామం వెరీ కామన్.
లస్ట్, కామం అందరికి ఉంటాయని, దానికి అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా ఉండదని అంటుంది ఈ సుందరి. అయితే దాన్ని ఎక్కడ, ఎప్పుడు చూపించాలో తెలుసుకోవాలని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఎవరికైనా వారి వారి పరిధి తెలిసి ఉండాలని సూచించింది. సెక్సీగా ఉన్నావు, హాట్ గ ఉన్నావు అంటే అంత వరకు సరిపోతుంది. నేను కూడా రిసీవ్ చేసుకుంటానంది.

 

ఓవర్ గా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఆ స్థానంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేదా తల్లి, చెల్లి ఉంటె అలా మాట్లాడతారో ఆలోచించుకోవాలి. అలా ఆలోచిస్తే ఎలా ఉంటుందో ముందే ఆలోచిస్తే బాగుంటుందని, ఎవరికీ ఇబ్బంది కలగదని తెలిపింది. అలాగే ఏదైనా మార్పు తీసుకురావాలంటే మనమే ముందు మారాలని, మనలో మనం మార్పు కోరుకోవాలని కామెంట్స్ చేసింది కల్పిక.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -