Kamal Haasan: ఆ సమస్యలతో ఆస్పత్రిలో కమల్.. ప్రాణాలకు అపాయమా?

Kamal Haasan: విశ్వనటుడు కమల్ హాసన్ కు తీవ్ర అస్వస్థత చేసింది. జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఆయన ఇబ్బందిపడుతుండగా.. హుటాహుటిన చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. కరోనా నుండి కోలుకున్న కమల్ హాసన్ పోస్ట్ కోవిడ్ లక్షణాలను కలిగి ఉన్నట్లు సమాచారం అందుతుండగా.. ఆయనను పోరూర్ రామచంద్ర హాస్పిటల్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

 

ఐదు దశాబ్దాలుగా సినిమాలు చేస్తూ విశ్వనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కమల్ హాసన్.. వయసు కారణంగా బీపీ మరియు షుగర్ తో కూడా బాధపడుతున్నట్లు సమాచారం అందుతోంది. చాలా సంవత్సరాలుగా హిట్ లేని కమల్ హాసన్.. ‘విక్రమ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు.

 

ఈ మధ్యనే బంధు మిత్రుల మధ్య ఘనంగా తన బర్త్ డే విడుకలను నిర్వహించుకున్న కమల్ హాసన్.. తాజాగా హైదరాబాద్ లో కళా తపస్వి కె. విశ్వనాథ్ ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ కాగా.. చెన్నై చేరుకున్నాక ఆయనకు అనారోగ్యం చేసిందని తెలుస్తోంది.

 

కాగా తమ అభిమాన నటుడికి అస్వస్థత కలిగిందని తెలుసుకున్న కమల్ హాసన్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. కమల్ హాసన్ ప్రస్తుతం తమిళంలో వస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తుండగా, డైరెక్టర్ శంకర్ తో కలిసి ‘భారతీయుడు2’ సినిమా చేస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts