Kamal Haasan: చోళ రాజులు హిందువులే కాదు.. పొన్నియన్ సెల్వన్ సినిమాపై కమల్ హాసన్ కామెంట్స్!

Kamal Haasan: మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొండియన్ సెల్వం సినిమా సెప్టెంబర్ 30 వ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా వివిధ భాషలలో భారీ బడ్జెట్ తో నిర్మితమై సెప్టెంబర్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఓవైపు మంచి కలెక్షన్లను రాబడుతున్నప్పటికీ మరోవైపు వివాదాలను కూడా ఎదుర్కొంటుంది. ఇప్పటికే ఈ సినిమాపై వస్తున్న వివాదాల పట్ల సూపర్ స్టార్ రజినీకాంత్ కుష్బూ వంటి వారు స్పందించారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాపై వస్తున్నటువంటి వివాదాస్పద వ్యాఖ్యలపై లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ స్పందించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ.. రాజరాజ చోళుడి కాలంలో అసలు హిందుత్వం లేదని ఈయన తెలియ చేశారు. అప్పట్లో శైవులు వైష్ణవులు మాత్రమే ఉన్నారని బ్రిటిష్ వారు వచ్చిన తరువాత మనల్ని ఏమని పిలవాలో తెలియక హిందువులు అని పేరు పెట్టి పిలిచారు అంటూ కమల్ హాసన్ పేర్కొన్నారు.

కలలకు కులం మతం భాష లేదని కానీ వీటి ప్రాతపదికన సినిమాలలో రాజకీయం చేయడం మంచిది కాదంటూ ఈయన మండిపడ్డారు. ఇక ఈ సినిమాని తమిళంలో కాకుండా ఇతర భాషలలో కూడా ఆదరించకుండా పెద్ద ఎత్తున వివాదాలు సృష్టించడం సరికాదని పేర్కొన్నారు. తెలుగు శంకరాభరణం సినిమాని తమిళ ప్రేక్షకులు ఆదరిస్తే తమిళంలో వచ్చిన మరోచరిత్ర సినిమాని తెలుగు వారు ఆదరించారని ఈయన గుర్తు చేసుకున్నారు.

సినిమాలకు భాషలేదని, కథ అద్భుతంగా ఉంటే తప్పకుండా ప్రేక్షకులు ఆ సినిమాని ఆదరిస్తారంటూ ఈ సందర్భంగా కమల్ హాసన్, పొన్నియన్ సెల్వన్ సినిమా గురించి తెలియజేశారు. ఎంతో పెద్ద స్టాత్మకంగా మణిరత్నం ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తే ఈ సినిమాను పెద్ద ఎత్తున వివాదాలను చుట్టుముట్టాయని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -