Kanalapalle: భర్త గొంతుకోసాడని వారం తర్వాత అలాంటి పని చేసిన భార్య?

Kanalapalle: సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అనేది సహజం. అయితే కొన్ని కొన్ని సార్లు ఆ గొడవలు పెరిగి పెద్దవిగా కూడా మారుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సందర్భాలలో ఒకరిని ఒకరు చంపుకోవడం వల్ల కూడా పెడుతూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఇటువంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి. భార్యను భర్త, భర్తను భార్య చంపుకోవడం లాంటి ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తే ఉన్నాయి. తాజాగా ఇలాంటి తరహాలోనే ఒక ఘటన చోటు చేసుకుంది. భర్త గొంతు కోశాడని పగ పెంచుకున్న భార్య అతనిపై పగ తీర్చుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా,గోస్సాడు మండలం కానాలపల్లె గ్రామంలో బ్రహ్మయ్య, లక్ష్మీదేవి దంపతులు నివాసం ఉంటున్నారు.

 

అయితే వీరికి చాలా ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం తరువాత వారికి ఇద్దరు చిన్నారులు కూడా జన్మించారు. అయితే వీరి కాపురం కొన్ని రోజుల పాటు సంతోషంగానే సాగింది. ఇదిలా ఉంటే గత కొద్దీ రోజులు నుంచి భార్యాభర్తలు తరుచు గొడవ వస్తూనే ఉన్నాయి. భార్యపై అనుమానంతో భర్త బ్రహ్మయ్య లక్ష్మీదేవిని వేధింపులకు గురి చేస్తుండేవాడు. ఈ నేపథ్యంలోనే గత నెల 25న భార్యాభర్తలు ఇదే విషయంపై మరోసారి గొడవ పడగా అప్పుడు ఇద్దరి మధ్య మాటలు యుద్ధం జరగడంతో అప్పుడు బ్రహ్మయ్య క్షణికావేశంలో బ్లేడుతో భార్య లక్ష్యీదేవి గొంతు కోసి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే లక్ష్మీదేవిని గమనించిన స్థానికులు వెంటనే ఆమెను హాస్పిటల్ కి తరలించారు. అయితే భార్య గొంతు కోసినప్పటి నుంచి భర్త బ్రహ్మయ్య కనిపించకుండా పోయాడు. అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలించారు.

 

ఇటీవల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీదేవి కొబ్బరి నీళ్ల కోసం బయటికి రావడానికి ఆ భర్త బ్రహ్మయ్య హాస్పిటల్ బయట కనిపించాడు. భర్తను చూసిన లక్ష్మీదేవికి ఒక్కసారిగా భయం పట్టుకుంది. పైగా అతని చేతిలో బ్లేడు ఉండడంతో మళ్లీ తనపై దాడి చేసేందుకే వచ్చాడని భయంతో వణికిపోయింది. ఈ క్రమంలోనే లక్ష్మీదేవి ముసుగు ధరించి భర్త వద్దకు వెళ్లింది. అనంతరం అతని చేతిలో ఉన్న బ్లేడ్ తీసుకొని భర్త గొంతును కోసింది. పక్కనే స్థానికులు అతన్ని అదే హాస్పిటల్ లో చేర్పించారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె తన భర్త బ్లేడుతో తన గొంతు కోశాడని, మళ్లీ బ్లేడుతో ఆస్పత్రికి రావడంతో తనను ఎక్కడ చంపేస్తాడేమోనన్న భయంతో అదే బ్లేడుతో తన భర్త గొంతు కోసినట్లు ఆమె తెలిపింది. అయితే లక్ష్మి దేవి చెప్పిన సమాధానంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -